సూర్య మతం మారాడా..?

 Posted March 29, 2017

is surya convert as muslimకోలీవుడ్ హీరో సూర్యకి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. గజినీ, సింగం సినిమాలతో టాలీవుడ్ లో కూడా టాప్ హీరో అయిపోయాడు. ఇక సూర్య భార్య   జ్యోతిక  సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విజయాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా సినిమాకు సూర్య నిర్మాతగా కూడా మారాడు.  అయితే తాజాగా సూర్య  మతం మారాడు అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం  జోరందుకుంది. మసీదులో సూర్య ఉన్న ఫొటో తెగ షేర్ అయిపోతోంది.

ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ డైరెక్షన్‌ లో సూర్య థానా సెర్నాధా కొట్టం అనే చిత్రంలో నటిస్తున్నాడని, షూటింగ్ సందర్భంగా ఆయన మసీదుకి వెళ్లి  ప్రార్ధనలు చేసినట్లు వైరల్ అవుతోంది. అయితే సూర్య  సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.  మూడేళ్ల క్రితం సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కోరిక మేరకు సూర్య కడపలోని మసీదును సందర్శించాడని అంటున్నారు. దీంతో  ఇస్లాంలోకి మారుతున్నట్టు వార్తలు వచ్చాయని, అటువంటి పుకార్లను నమ్మవద్దని  చెబుతున్నారు.

Post Your Coment
Loading...