తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్ మోహనరావు పై ఐటీ దాడులు..

Posted December 21, 2016

it checkings on rammohanraoత‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్శ‌ద‌ర్శి రామ్మోహ‌న్‌రావు ఇంట్లో ఆదాయ‌ప‌న్ను శాఖ‌ అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు ఆయ‌న వ‌ద్ద ఎంత సొమ్ము దొరుకుతుందో అనే ఉత్కంఠ కు తెర తీసినట్టయింది . చెన్న‌య్‌లోని అన్నాన‌గ‌ర్‌లోని రామ్మోహ‌న్‌రావు కుమారుడి ఇంట్లోను, కార్యాల‌యాల్లోనూ ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు చేయటం తో పాటు మొత్తం 13 చోట్ల ఏక‌కాలంలో ఈ తనిఖీలు కొన‌సాగుతున్నాయి. .త‌మిళ‌నాడుతో పాటు క‌ర్టాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రామ్మోహ‌న్‌రావు బంధువుల ఇళ్ల‌లోనూ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం వందలకోట్ల నగదును బంగారంగా మార్చారని రామ్మోహన్‌రావుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఐటీ దాడుల్లో దొరికిన మాజీ టీటీడీ మెంబర్‌ శేఖర్‌రెడ్డి వాంగ్మూలం ఆధారంగా తమిళనాడు సీఎస్ రామ్మోహన్‌రావు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి.

అసలు ఈ రేంజ్ లో బ్లాక్‌మనీ వెనుక సూత్రధారి ఎవరు అనే కోణం లో సీబీఐ అధికారులు ఆరాతీయడం తో రామ్మోహన్‌రావు ఇంట్లో దాడులు కొనసాగుతున్నాయి.తెలుగువాడైన రామ్మోహన్‌రావు జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.ఐతే ఈ సోదాల్లో భారీగా నగదు బయటపడినట్లు తెలుస్తోంది. సీఎస్ స్థాయి అధికారి ఇంట్లో ఐటీ దాడులు జరగడం అనేది తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఇదే మొదటిసారి.ఈ దాడుల వెనుక తమిళ రాజకీయ కారణాలున్నాయని కూడా టాక్ .

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY