ప్రశాంత్ పరువు తీస్తున్న జగన్ అండ్ కో?

 Posted May 8, 2017 (3 weeks ago) at 10:12

jagan and co insult to prashant kishor
తాజెడ్డ కోతి వనమంతా చెరిచిందని ఓ పాత నానుడి .ఇప్పుడు వైసీపీ వ్యవహారం అలాగే వుంది.ఆంధ్రప్రదేశ్ లో అధికారమే పరమావధిగా వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న జగన్ అండ్ కో శృతి మించి బాబు అమెరికా పర్యటన సందర్భంగా చేసిన పని సామాన్యులకు సైతం షాక్.ఇర్వింగ్ మేయర్ కి బాబు మీద ఫిర్యాదు చేస్తూ ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తరపున లేఖ రాసినట్టు చేసింది వైసీపీ యేనని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.వైసీపీ వ్యవహారశైలి తెలిసిన వారికి జగన్ అండ్ కో ఇలా చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం కలగడం లేదు కూడా.అయితే ఆ లేఖ రాజకీయ కక్షపూరితమని అర్ధం చేసుకున్న ఇర్వింగ్ మేయర్ బాబు సమావేశానికి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడంతో జగన్ అండ్ కో బిత్తరపోయింది.రెండు రోజుల కిందటే అశాస్త్రీయంగా ఏపీ విభజన జరిగిన అంశాన్ని అమెరికా గడ్డ మీద ప్రస్తావించారని వైసీపీ నేతలు రంకెలేశారు.ఏపీ పరువు గంగలో కలుస్తుందని అంబటి గారు మీడియా ముఖంగా వాపోయారు.తాజా పరిణామంతో నిజంగానే వైసీపీ నేతలు ఏపీ పరువుకు గండి కొట్టారు.

సీఎం విదేశీ పర్యటనల్ని ఈ స్థాయిలో రాజకీయం చేసిన సందర్భం దేశంలో ఎన్నడూ జరగలేదు.ఈ పరిస్థితికి కారణమైన వైసీపీ దానికి భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.అయితే ఈ పరిణామం తో వైసీపీ కి జరిగే నష్టాన్ని పక్కనబెడితే ఆ పార్టీ వ్యూహకర్తగా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ పరువు తీస్తున్నాయి.ఐఐటిఎన్స్ బృందంతో ఆయన వేసే వ్యూహాలు ఇంత చౌకబారుగా ఉంటాయా అనిపిస్తోంది.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తాజా పరిణామం తర్వాత ఆ ఏ మెయిల్ లెటర్ తో జగన్ కి ఏ సంబంధం లేదని వైసీపీ నేతలు బుకాయించవచ్చు . ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎన్నికల వ్యూహకర్త బాధ్యతలు మోస్తూ ఆ పని చేయలేరు.ఆయన తరపున ఈ పని వైసీపీ చేయకపోవచ్చు.ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ ఇంకెంత దూకుడుగా వ్యవహరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.ఇవన్నీ చూస్తుంటే వైసీపీ చేసే పనులకు ఓట్లు రాలడం మాట ఎలా వున్నా సలహాదారు గా వున్న ప్రశాంత్ కిషోర్ పరువు కూడా తీసి బజార్లో నిలబెట్టడం ఖాయమనిపిస్తోంది.

Post Your Coment
Loading...