అక్కడ జగన్ సేనకు ఎదురులేదు..

Posted [relativedate]

jagan followers dont have any opposition
2014 ముందు ఉపఎన్నికల ఫలితాలతో తన ఫోటో ఉంటే చాలు వైసీపీ అభ్యర్థులు గెలవడానికి అనుకున్నారు జగన్ .అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఆయనకి ఓ విషయం అర్ధమైంది.ప్రజాభిమానం తో పాటు దానికి సక్రమ పద్ధతిలో ప్రచారం తప్పదని కూడా జగన్ కి తెలిసింది.మీడియా మేనేజ్ మెంట్ లో ఆరితేరిన బాబు బాటలోనే నడవాలని జగన్ అప్పుడే నిర్ణయించుకున్నట్టున్నారు.ఈ విషయంలో బాబుని అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారు జగన్.రొటీన్ పబ్లిసిటీ,పత్రికలు,టీవీల కన్నా సోషల్ మీడియా ద్వారా ఓ విషయం చురుగ్గా వెళుతుందన్న విషయం పసిగట్టి అందుకు తగ్గట్టే వ్యూహం రూపొందించారు.అందుకోసం ఓ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారు.

అలా రూపుదిద్దుకున్న జగన్ ఐటీ సేనకు ఎదురులేదని చెప్పాలి.సోషల్ మీడియా విస్తృతి కోసం అవసరం అనుకున్న చోట్ల తెలుగు వెబ్ సైట్ లకి వైసీపీ ముఖ్యుల నుంచి ఆర్ధిక సాయం అందుతోంది.సీనియర్ జర్నలిస్టుల్ని ఆ దిశగా జగన్ ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే సోషల్ మీడియాలో దాదాపు 70 % వెబ్ సైట్స్ జగన్ అనుకూలంగా కధనాలు ఇస్తున్నాయి.పైగా ఏ వెబ్ సైట్ లో జగన్ అనుకూల వార్త వచ్చినా కూడా వైసీపీ డిజిటల్ విభాగం దాని ప్రమోషన్ బాధ్యతను తీసుకుంటున్నాయి.దీంతో సదరు వెబ్ సైట్స్ ఆదాయం పెరుగుతుండటంతో వాటి యజమానులు కూడా జగన్ వార్తలకి ప్రాధాన్యమిస్తున్నారు.మీడియా మేనేజ్ మెంట్ లో దిట్ట అని చెప్పుకునే టీడీపీ మాత్రం సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసరికి వెనకపడుతోంది.అధికారంలో వుంది కాబట్టి చిన్న మీడియా కదా అని వదిలేస్తుండవచ్చు.కానీ రేపటి ఎన్నికల్లో దాని ప్రభావం పడ్డాక కళ్ళు తెరిచినా ప్రయోజనం ఉండదు.ఏమైనా వస్తున్న,రాబోయే మార్పులకి అనుగుణంగా సోషల్ మీడియా ని వాడుకుంటున్న జగన్ సేనకు ఆ రంగంలో ఎదురు లేదని చెప్పుకోవాలి.