నోట్ల రద్దుపై జగన్ ధైర్యం పెరిగిందా?

0
567

Posted November 22, 2016 (2 weeks ago)

jagan have brave because of modi cancel 500 1000 rs notes changing processపెద్ద నోట్ల రద్దు మీద మొదట్లో ఆచితూచి స్పందించిన వైసీపీ అధినేత జగన్ కి ఇప్పుడు ధైర్యం పెరిగిందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది …కానీ ? ఈ కానీ ఎందుకో చెప్పాలంటే ఓ పదిహేను రోజులు వెనక్కెళ్ళాలి.మోడీ ప్రకటన తర్వాత ఆ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి దాన్ని ఆహ్వానిస్తూ ఓ మొక్కుబడి ప్రకటన ఇచ్చారు.అసలు అధినేత జగన్ ఇప్పటికీ నోరు విప్పలేదు.ఎన్ని విమర్శలొస్తున్నా అయన మౌనమే నా భాష అంటున్నారు.అయితే కాలంతో పాటు నోట్ల మార్పిడికి సంబంధించి సామాన్యుల ఇబ్బందుల్ని చూసాక వైసీపీ ధైర్యం పెరిగింది.సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో ఇది ఏకపక్ష యుద్ధం కాదని వైసీపీ కి అర్ధమైంది. అందుకే నెమ్మదిగా అయినా గొంతు సవరించుకుని మోడీ,బాబు మీద దాడి పెంచింది.

ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు జోడి దేశానికి బోడి అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.నిజంగా ఆ నిర్ణయం వెనుక ఉండి ఉంటే బాబు క్షమాపణ చెప్పాలని అయన డిమాండ్ చేశారు.మోడీ నిర్ణయం వల్ల జగన్ కి ఇబ్బంది అయినా మౌనం దాల్చిన వైసీపీ నేతలు అదను చూసి విరుచుకుపడుతున్నారు. అయితే ఇంకా మూలవిరాట్టు జగన్ ఉలుకు పలుకు లేకపోవడం అంతా చూస్తూనే వున్నారు.ఈ మాటలేవో జగన్ నోటి వెంట వస్తే పైకి కనిపిస్తున్నట్టు వైసీపీ ధైర్యం పెరిగిందని ఒప్పుకోవచ్చు..

NO COMMENTS

LEAVE A REPLY