ఎన్టీఆర్ కి జగన్ నుంచి ఈ కబురా?

Posted [relativedate]

jagan bumper offer for ntr
ముల్లుని ముల్లుతోనే తీయాలి….ఈ పాత సామెతని సరికొత్తగా అమలు చేసేందుకు రెడీ అయిపోయారట వైసీపీ అధినేత జగన్.మనకి వచ్చే ఓట్లని పెంచుకోవడమే కాదు …ప్రత్యర్థుల ఓట్లని చీల్చడం ద్వారా కూడా ఎన్నికల్లో గెలవొచ్చని ఎన్నో సందర్భాల్లో రుజువైంది.2009 లో ప్రజారాజ్యం వల్ల ప్రతిపక్ష ఓటు చీలి వై.ఎస్ మళ్లీ అధికార పగ్గాలు అందుకోగలిగారు.ఇప్పుడు జనసేన కూడా అందుకే ఉపయోగపడుతుందేమో ….వైసీపీ ని ఇంకోసారి పవన్ దెబ్బకొడతారేమో అన్న భయం జగన్ ని వెంటాడుతోంది.దీనికి కౌంటర్ గా జగన్ అదిరిపోయే ప్లాన్ వేశారు.అదేమిటంటే ..

జనసేన వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి …అదే స్థాయిలో ప్రభుత్వ అనుకూల ఓటులో చీలిక తెచ్చే మార్గాల్ని అన్వేషించారు.అందులో భాగంగా ఎప్పుడో ఎన్టీఆర్ కి ఓ సందేశం పంపారు.హరికృష్ణకు తగిన పదవి ఇస్తాం …ప్రతిగా అయన వైసీపీలో చేరాలి ….ఇదీ జగన్ నుంచి అప్పట్లో వచ్చిన ప్రతిపాదన ..అయితే దానికి ఎన్టీఆర్ పెద్ద సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తాజాగా మరో కబురెళ్ళిందట..కొత్త పార్టీ పెట్టి టీడీపీ అనుకూల ఓటుని చీలిస్తే భవిష్యత్ లో అన్ని విధాలా అండగా ఉంటామని జగన్ క్యాంపు నుంచి ఆఫర్ వెళ్లిందట.అయితే ఇప్పుడిప్పుడే సినిమాల్లో పూర్వవైభవం దక్కుతున్నందున అలాంటి ఆలోచనకి దూరంగా వుండాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.ఈ విషయాన్నే వైసీపీ దూతలకి చెప్పారట ఎన్టీఆర్.దీంతో వైసీపీ మరో వ్యూహానికి పదును పెట్టే పనిలో పడింది.