కుర్రోళ్లోయ్… కుర్రోళ్ళు

Posted [relativedate]

jagan pawan kalyan nara lokesh political leaders target only youthగత తరం కదా నాయకుడు బాలకృష్ణ సినిమాలో ఇరువురు భామల కౌగిలిలో స్వామీ ఇరుకున పడి నీవు నలిగితివా అనే పాత పాత గుర్తొస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చూస్తుంటే ..ఐతే పాట లో ఇరువురు… ఇక్కడ సీన్ లో ముగ్గురు జగన్ బాబు ,లోకేష్ బాబు ,పవన్ కళ్యాణ్ బాబు, ఈ ముగ్గురు బాబుల మధ్య ప్రజలు ..నలుగుతున్నారు. అటు జగన్‌ యువభేరి.. ఇటు పవన్‌ ఇష్టాగోష్ఠి.. మధ్యలో లోకేశ్‌ యువచైతన్యయాత్ర.ఏ యాత్రకి వెళ్లాలో ఎవరు చెప్పేది వినాలో అర్ధం కాదు ఎవరు ఓదారుస్తారో తెలీదు..!

అంతటా యువజపం.. అన్ని సభలూ విద్యార్థులతోనే.! వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్రలో సభ నిర్వహిస్తే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాయలసీమలో విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోస్తాలోని మూడుజిల్లాల్లో యువచైతన్యం పేరిట విద్యార్థులతో ముఖాముఖి చేపట్టారు. ముగ్గురు నేతలు.. మూడు ప్రాంతాలు.. టార్గెట్ యూత్ .,

2000వ సంవత్సరానికి కాస్త ముందూ వెనుకా పుట్టినవారే ఇప్పుడు ఈ ముగ్గురి లక్ష్యం. 2019లోపు కొత్తగా సంపాదించుకునేవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొన్ని లక్షల ఓట్ల తేడాతోనే అధికారం చేతులు మారుతున్న పరిస్థితుల్లో తొలిసారి ఓటర్లు 2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో పాలక తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే మోహరించి ఉండగా.. కొత్తగా జనసేన తో రంగప్రవేశం చేశారు.

ప్రస్తుతం కనిపిస్తున్న ముగ్గురు యువ నేతలు మాత్రం సమరానికి అప్పుడే సన్నద్ధమవుతున్నారు.
== జగన్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
== అనుమతిస్తే 2019లో పోటీ చేస్తానని లోకేశ్‌ గత నెలలోనే ప్రకటించారు.
== వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్‌ అనంతపురం సభలో స్పష్టం చేశారు

== జగన్‌ యువభేరి పేరిట ఇటీవలే కర్నూలులో నిర్వహించిన సభకు పెద్ద మొత్తంలో విద్యార్థులను సమీకరించారు. అంతకు ముందు తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులలోనూ జగన్‌ సభలు జరిగాయి.
== టీడీపీకి ముఖ్యమైన జన చైతన్య యాత్రల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికి ఒక్కరోజే పాల్గొంటుండగా ఆయన తనయుడు లోకేశ్‌ వారానికి మూడు రోజులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటనల్లో కళాశాలలకే వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. ఆయన గతంలో కూడా కొన్ని కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు
=== ఈ వరుసలో లేటెస్ట్‌ ఎంట్రీ పవన్‌ కల్యాణ్‌. అనంతపురం సభ తర్వాత రోజు ప్రత్యేకించి విద్యార్థులతో ఇష్టాగోష్ఠిని ఏర్పాటు చేశారు. ఎవరు ఎప్పుడు మొదలుపెట్టినా విద్యాలయాల బాట ఇక ముందు కూడా కొనసాగనుంది. అన్ని జిల్లాల్లో విద్యాలయాల్లో లేదా బయట వేదికలపై విద్యార్థులతో సభలు నిర్వహించడానికి ఈ నేతలు సన్నద్ధమవుతున్నారు.

భావి కార్యకర్తలు, ప్రచారకర్తలు..యువతే
యూత్ శాతం ఎక్కువ కావడంవల్ల అన్ని పార్టీల దృష్టీ వారిపైనే. అందులోనూ విద్యార్థులను ఆకర్షించడమంటే.. కేవలం వారి ఓట్లను బుట్టలో వేసుకోవడం మాత్రమే కాదు. వారినే కార్యకర్తలుగా, ప్రచారకర్తలుగా మలచడం. నవతరం ప్రచార సాధనాల్లో భాగమైన సోషల్‌ మీడియాలో ఉచిత ప్రచారానికి సైతం విద్యార్థులు ఉపయోగపడుతున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లోనే సుమారు రెండు లక్షల మంది విద్యార్థులున్నారు. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ, సాధారణ డిగ్రీ-పీజీ కళాశాలల్లోనూ లక్షలాదిగా ఉన్న వీరు.. భవిష్యత రాజకీయాలకు ఓ సంపద. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల సంఖ్య వీరికి అనేక రెట్లు ఎక్కువ. 2019 ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల్లోనూ చాలామంది అప్పటికి ఓటర్లుగా ప్రమోషన్‌ పొందుతారు. ఈ దృష్ట్యా ఇంటర్‌ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థుల చుట్టూ ఇప్పుడు రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి.

మండలి కోసం.మేనా ఇదంతా … పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లోనూ, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చూపేందుకు జగన్‌, లోకేశ్‌ సిద్ధమవుతున్నారు. మండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో కొత్తగా ఓటర్లను చేర్పించడంలో లోకేశ్‌ టీం కీలక పాత్ర పోషించింది. మండలి ఎన్నికల్లో పాత ఓటర్ల జాబితాల స్థానంలో పూర్తిగా కొత్త జాబితాలు రూపొందిస్తుండటంతో… ఈ ఎన్నికల్లోనూ యువత, ముఖ్యంగా నూతన గ్రాడ్యుయేట్ల పాత్ర కీలకం కానుంది. ’డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ ఇండియాకు వరం అని ప్రతి సభలోనూ చెబుతున్న చంద్రబాబు.. నవ తరాన్ని తెలుగుదేశం పార్టీవైపు ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేసే బాధ్యతను లోకేశ్‌ తీసుకుంటున్నారు. జగన్‌ ఇప్పటివరకు నిర్వహించిన సభల్లో ఎక్కువ భాగం మండలి, మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే జరిగాయి. పూర్తి స్థాయిలో 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్‌ పావులు కదుపుతున్నారు.