బాబు మీద కేసుల సునామీ?

 Posted May 4, 2017 (4 weeks ago) at 18:06

jagan plan to put a cases on chandrababu by common people
అవినీతి,పక్షపాతం వంటి ఆరోపణలతో ఏపీ లో టీడీపీ ని దెబ్బకొట్టలేమని భావించిన వైసీపీ అధినేత జగన్ సరికొత్త ప్లాన్ వేస్తున్నాడు. ఈసారి జగన్ వేసిన ప్లాన్ ఆషామాషీగా లేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్ని,ఇప్పటిదాకా అమలు చేసిన తీరుని హైలైట్ చేస్తూ ఈసారి వ్యూహరచన చేశారు జగన్. టీడీపీ మేనిఫెస్టో ని బాబు సర్కార్ అమలు చేయనందుకు నిరసనగా మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు,సామాన్య జనంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఒక్కో నియోజకవర్గంలో 25 వేల మందికి తక్కువ కాకుండా ఈ కేసులు పెట్టేలా వైసీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు.

రైతు రుణ మాఫీ,డ్వాక్రా రుణ మాఫీ,నిరుద్యోగ భృతి,ఇంటికో ఉద్యోగం వంటి బాబు పాపులర్ హామీల వైఫల్యాన్ని ఎత్తి చూపేలా ఈ కేసులు ఉంటాయట.ఈ కేసులు పెట్టే సమయంలో జగన్ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేసే అవకాశం వుంది.మొత్తానికి ఈ కేసుల వ్యూహం బాబుని చేయమని పెట్టడం ఖాయం గానే కనిపిస్తోంది.వైసీపీ వ్యూహం గురించి ఉప్పందుకున్న టీడీపీ దాన్ని కౌంటర్ చేయడం మీద దృష్టి పెట్టింది.కానీ కేసుల సునామీని ఎదుర్కోవడం అంత తేలిక అయ్యేలా లేదట.

Post Your Coment
Loading...