జగన్ భారీ స్కెచ్..ఎమ్మెల్యేల రాజీనామా ప్లాన్?

Posted [relativedate]

jagan want to do decide will ycp mlas resigned
అటు మోడీ సర్కార్ …ఇటు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకకాలంలో దెబ్బ కొట్టేందుకు ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాడు వైసీపీ అధినేత జగన్. నోట్ల రద్దు ప్రభావాన్ని …హోదా ఉద్యమాన్ని కలిపి వాడుకోడానికి పార్టీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నాడు.జగన్ అంత ధైర్యం ఎందుకు చేస్తున్నాడు? ఒకవేళ ఉపఎన్నికల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్ ఉండదని తెలిసి కూడా జగన్ సంచలన నిర్ణయం తీసుకోడానికి కారణం బీజేపీ నే అని తెలుస్తోంది.అదెలాగో తెలుసుకోవాలంటే ఓ మూడు నెలల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే..

మోడీ సర్కార్ తన్ను అసలు లెక్కచేయడం లేదని చంద్రబాబు చిర్రుబుర్రులాడుతున్న రోజులవి.ప్రత్యేక హోదా కావాలని బాబు గొంతు లేస్తున్న కాలమది.బీజేపీ కూడా బాబుతో తెగదెంపులు చేసుకుంటుందేమో అన్న పరిస్థితులు తలెత్తాయి.అప్పుడే కమలం…వైసీపీ మధ్య పొత్తుకు ఓ పక్క రాష్ట్రపు నేత ప్రయత్నించారు. వెంటనే జగన్ ఉత్సాహంగా బీజేపీ తో కలిస్తే ఎలా ఉంటుందని ఓ సర్వే జరిపించుకున్నాడంట.దాని వల్ల పార్టీ కి అండగా ఉంటున్న వర్గాలు దూరం అవుతాయని,నష్టం తప్ప లాభం ఉండదని ,బీజేపీ పట్ల ఏపీ లో సానుకూలత లేదని ఆ సర్వే తేల్చింది.కమలం మీద ఆశతో వరసగా ఆరు సర్వేలు చేసినా ఇవే ఫలితాలు …పైగా క్షేత్రీయ స్థాయిలో వైసీపీ కి అనుకూల వాతావరణం ఉందని సర్వే నివేదికలు చెప్పడంతో జగన్ కి ఎక్కడలేని ధైర్యం వచ్చిందట.అందుకే మళ్లీ హోదా ఉద్యమానికి పూనుకున్నారంట. బీజేపీ వైపు వెళ్లడం కన్నా ఒంటరిగా ఉపఎన్నికల్లో మోడీ,బాబు ద్వయాన్ని ఢీకొట్టి గెలిస్తే వచ్చే ఎన్నికల్లో తిరుగుండదని జగన్ డిసైడ్ అయి ఎంపీ,mla లతో రాజీనామాకు ప్లాన్ చేస్తున్నారంట.ఇది క్లిక్ అయితే వైసీపీ దశ తిరిగినట్టే ..లేకుంటే అదే స్థాయిలో రివర్స్ షాక్ తప్పదు..చూద్దాం ఏమి అవుతుందో?