శశికళ కేసుతో జగన్ లో గుబులు?

Posted February 15, 2017 (2 weeks ago)

jagan tension by watching seshikala case
తమిళనాడులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడడంతో జగన్ లోనూ గుబులు మొదలైందని ప్రచారం జరుగుతోంది. 66 కోట్ల అక్రమాస్తుల కేసులోనే నాలుగేళ్లు పడితే… అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువున్న తన కేసులో ఏం జరుగుతుందోనని వైసీపీ అధినేత టెన్షన్ పడుతున్నారట. ఈ మేరకు కొందరు వైసీపీ నాయకులను ఆయన పిలిపించుకొని మాట్లాడారట.

చిన్నమ్మ వేగం పెంచడం వల్లే ఈ పరిణామాలు దారి తీశాయి కాబట్టి ఇక తాను కొంత వేగం తగ్గించాలని జగన్ నిర్ణయింకున్నారట. అందుకే కేంద్రంపై విమర్శలు మానుకోవాలని పార్టీ నాయకులు కూడా యువనేతకు సూచించారట. ముఖ్యంగా హోదాపోరు అంటూ ఉద్యమించడం ఇక పక్కనబెట్టేయడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్.

అసలే ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ తో చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిపోయారు. ఈ తరుణంలో జగన్ జైలుకెళ్లితే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడుతుంది. అదే జరిగితే ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేజారే ప్రమాదముంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో అధికారం మాట అటుంచి… కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలన్నా ఇబ్బందే.

జగన్ అక్రమాస్తుల కేసు తీర్పు ఇప్పుడు వచ్చిందంటే ఆయనకు ఎంత లేదన్నా 10 ఏళ్లు శిక్ష పడడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే గాడిలోకి పడుతున్న వైసీపీకి ఇది చాలా పెద్ద దెబ్బ. జగన్ జైలుకెళ్లితే పార్టీ ఉనికికే ప్రమాదం. కాబట్టి ఇవన్నీ విషయాలు జగన్ … పార్టీ నాయకులతో చర్చించారట. అనవసరంగా లేనిపోనివి మాట్లాడ్డం కూడా తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. మరో ఏడాది వరకు కొంత సైలెంట్ గా ఉండాలని డిసైడయ్యారని టాక్.

NO COMMENTS

LEAVE A REPLY