జగన్ కి 10 జన్ పథ్ పిలుపు?

 Posted [relativedate]

jagan to called from 10 janpath
వైసీపీ అధినేత జగన్ కి 10 జన్ పథ్ నుంచి పిలుపు వచ్చిందా? కాంగ్రెస్ లో చేరితే బాగుండని సలహా వచ్చిందా? విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ దిశగా సంకేతాలు మాత్రం వచ్చాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వేగులు జగన్ సన్నిహితులతో మాట్లాడింది అక్షర సత్యం. అందుకు సాక్ష్యమే ఢిల్లీ పెద్దలు గడిచిన రెండు రోజుల్లో మాట్లాడిన మాటలు.డిగ్గీ రాజా తొలుత ఏపీ కి వచ్చి ఏమన్నారో చూద్దాం! ‘జగన్ పాదయత్రని స్వాగతిస్తున్నాం…హోదా అంశంలో వైసీపీ తో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదన్నారు’ …..కానీ ఇప్పటికీ జగన్ పాదయాత్ర గురించి వైసీపీ ఆలోచిస్తోంది తప్ప స్పష్టమైన ప్రకటన చేయలేదు.కానీ డిగ్గీ రాజా వారు ముందుగానే సాగిల పడిపోయారు. వైసీపీ గురించి 10 జన్ పథ్ అనుమతి లేకుండా దిగ్విజయ్ మాట్లాడగలరా ?

ఇక ప్రస్తుతం రాహుల్ కి కర్త,కర్మ,క్రియ లా వ్యవహరిస్తున్న కొప్పుల రాజు ప్రియ శిష్యుడు,మాజీ కేంద్ర మంత్రి జె.డి .శీలం పొన్నూరులో కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది.కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా జగన్ ముఖ్యమంత్రి కాలేడని అయన చెప్పారు. ఓ రకంగా జగన్ ఎందుకైతే కాంగ్రెస్ కి దూరమయ్యాడో అదే పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రావడానికి హోదా అంశం రెడీ గా వుంది.జగన్ కూడా ఢిల్లీ దూతల మాట విన్నాకే కొన్నాళ్ళు పక్కన పెట్టిన హోదా అంశాన్ని మళ్లీ అస్త్రం గా మలుస్తున్నారు. ఇక 10 జన్ పథ్ పిలుపుకి జగన్ ఓకే చెప్పడం మాత్రమే మిగిలి వుంది.