కాఫీ కోసం ఢిల్లీ వెళ్లాలా జగన్..?

Posted April 7, 2017 (3 weeks ago)

jagan went to delhi for a cup of coffeeకప్పు కాఫీ కోసం ఫ్లైటెక్కి ఢిల్లీ వెళ్లడం ఎందుకు, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఎందుకు జగన్.. ఏం మీ ఇంట్లో కాఫీ లేదా.. ఏంటీ డైలాగ్ అనుకుంటున్నారా. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ టూర్ పై వేసిన సైటర్ ఇది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులపై జగన్ రాష్ట్రపతిని కలవడాన్ని జేసీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి చేతులో ఏమీ లేదని ప్రణబ్ కు, జగన్ కు బాగా తెలుసని, అసలు కీ ప్రధాని చేతిలో ఉందన్నారు. అప్పటి వైఎస్ హయాం నుంచి ఇప్పుడు కేంద్ర రాజకీయాల వరకూ ఫిరాయింపులు కామనైపోయారని గుర్తుచేశారు జేసీ.

కాలం మారిపోతున్నప్పుడు చంద్రబాబు మడి కట్టుకు కూర్చుంటే వెనుకబడిపోతారన్నారు జేసీ. గతంలో ఫిరాయింపుదారులకు పదవులు కట్టబెట్టినప్పుడు మాట్లాడని జగన్.. ఇప్పుడు మాత్రం ఆకాశం ఏదో ఊడిపడ్డట్లుగా రాద్ధాంతం చేయడమేంటని నిలదీశారు. వైఎస్ హయాంలో ఫిరాయింపుదార్లను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు జగన్ కు ఉందో లేదో ఆయన తనను తాను ప్రశ్నించుకోవాలని చెప్పారు.

అసలు జగన్ ఢిల్లీ టూర్ వెనుక మరో మర్మం ఉందని జేసీ పాయింట్ తీశారు. జగన్ కు తాను చేసిన పాపాలు ఎక్కువయ్యాయి అనిపించినప్పుడల్లా.. హస్తిన వస్తారని ఛలోక్తి విసిరారు. జగన్ బెయిల్ పిటిషన్ పై కోర్టు కీలక నిర్ణయం తీసుకోనున్న తరుణంలో.. ఆయన ఢిల్లీ రావడం ఎందుకో అందరూ ఊహిస్తున్నారని చెప్పారు. కేసుల విషయంలో లాబీయింగ్ చేసుకుంటూ.. పైకి మాత్రం ఫిరాయింపులంటూ లెక్చర్లు దంచడమెందుకని జగన్ ను కడిగిపారేశారు జేసీ. ఇప్పటికైనా జగన్ పరిణతితో వ్యవహరించాలని హితవు పలికారు.

Post Your Coment
Loading...