మొత్తానికి జై కుండ బద్దలు కొట్టేశాడుగా!

Posted February 17, 2017 (1 week ago)

jai revelaed anjali and his love affairకోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారిన ప్రేమ జంట అంజలి, జై. జర్నీ సినిమాతో వీరి ప్రేమ జర్నీ మొదలైందని, ఇద్దరు డేటింగ్ లో కూడా ఉన్నారని ఇలా రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్లను వాళ్లిద్దరూ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.

తాజాగా హీరో సూర్య.. జ్యోతికతో కలిసి చేసిన దోశ ఛాలెంజ్ లో కూడా జై, అంజలి పార్టిసిపేట్ చేశారు. దోశ వేసి ఆ ఫొటోలను షేర్ చేశారు. దీంతో వీరి ప్రేమాయణం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటివరకు తమ మధ్య ఉన్న రిలేషన్ ని బయటపెట్టని జై  ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. మా మధ్య సంబంధం ఉన్నమాట నిజమే. ఒకరినొకరు ఇష్టపడ్డాం..  అని కుండ బద్దలుకొట్టేశాడు. నాకే కాదు అంజలి అంటే మా నాన్న, అమ్మకి కూడా ఇష్టమేనని క్లారిటీ ఇచ్చాడు. అయితే పెళ్లి గురించి మాత్రం మాటదాటేశాడు జై.  

NO COMMENTS

LEAVE A REPLY