జేసీ మిఠాయిలో మిరియం ఘాటు…

 jc diwakar reddy said sweet hot words about special status

ఫై పూతల్లేకుండా మాట్లాడే రాజకీయ నేతల్లో అనంతపురం ఎంపీ జె.సి. దివాకరరెడ్డి పేరు ముందుంటుంది. ఎవరో ఎదో అనుకొంటారని, ఎవరికో నష్టం జరుగుతుందని పెద్దగా ఆలోచించకుండా మనసుకు తట్టింది మాట్లాడే నాయకుడు ఆయన. ప్రత్యేక హోదా అంశంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశాక జేసీ మాటల్లో కనిపించిన ఆశాభావం ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మిఠాయి అయ్యింది. ఆ మిఠాయి కరిగే లోపు మిరియం ఘాటు కూడా తగిలింది.

ఒక్కరోజు గడిచాక జేసీ మాటల్లో కాస్త తేడా వచ్చింది. కేంద్రం ఎదో చేస్తుందన్న నమ్మకం వ్యక్తం చేసిన ఆయన మాటల్ని అందరూ ప్రత్యేకహోదాకి ఆపాదించుకున్నారు. కానీ జేసీ మళ్లీ నోరు విప్పారు. హోదా కష్టమేనని చెప్పిన ఆయన ప్రత్యేక ప్యాకేజ్ రావచ్చని అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు తేడాలోనే ఆ టోన్ మారడం చూసిన కొందరు జేసీ మిఠాయిలో మిరియం ఘాటు తగిలిందే అని చమత్కరిస్తున్నారు. ఎప్పుడూ ఘాటు వ్యాఖ్యలు చేసే జేసీ తీపి మాటలు మాట్లాడాక కూడా ఇలా రివర్స్ అయ్యిందేమిటబ్బా అని ఆంధ్రులు గొణుక్కుంటున్నారు.

Post Your Coment
Loading...