జియో దెబ్బకు విలవిల్లాడిన టెలికాం షేర్లు ..

Posted December 1, 2016

Image result for jio image

బాహుబలి సినిమాలో శివగామి డైలాగు గుర్తుందా ..నా మాటే శాసనం అనేది ,,సరిగ్గ్గా ఏ రోజు ముఖేష్ అంబానీ మాట్లాడింది కూడా అలానే వుంది ..అదేంటో చూద్దామా ….రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతున్నంత సేపు…ఇతర టెలికాం షేర్లు గజ గజ లాడాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత సేవల ఆఫర్ మరో మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించగానే..స్టాక్ మార్కెట్ లో టెలికాం షేర్ ల విలువ రూ.3000 కోట్లు ఆవిరైపోయింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 1.66 శాతం, ఐడియా సెల్యులార్ 5.93 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం కుదేలయ్యాయి.ఎయిర్టెల్ షేర్లు, ముఖేష్ స్పీచ్ ప్రారంభం కాగనే రూ.318.3కు దిగొచ్చాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,276 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.

76.60గా ట్రేడ్ అయిన ఐడియా సెల్యులార్ షేర్లు కూడా ముఖేష్‌ స్పీచ్తో రూ.74.20కి పడిపోయాయి. ఈ కంపెనీ కూడా రూ.792 కోట్లను మార్కెట్ విలువను పోగొట్టుకుంది. నేడు దేశీయ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ భారీగా నష్టపోయినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమవుతుందని వారు పేర్కొన్నారు. మొత్తం గా ముఖేష్ మాట్లాడితే ఇతర కంపెనీ లకి వచ్చిన నష్టం రూ.౩౦౦౦ కోట్లు .

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY