ఆ గుట్టు విప్పిన బాబు…షాక్ లో విలేకరులు?

 Posted March 27, 2017 (5 weeks ago)

journalists meets chandrababu naidu to demand house lands
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత …ఈ సామెత జర్నలిస్టులకి భలేగా సరిపోతుంది. ప్రపంచంలో అందరి కష్టాల కోసం తమ కలం ద్వారా పోరాడే ఆ జీవులు తమ కోసం యాజమాన్యాల దగ్గర కనీసం నోరు కూడా విప్పలేరు పాపం.ఈ విషయం వారికి అర్థమైనా బెట్టు కోసం ఏదో అలా బయటపడకుండా నెట్టుకొచ్చేస్తుంటారు.అయితే తమ సమస్యలు,హక్కులు అంటూ ఇటీవల విజయవాడలో దాదాపు 5 వేల మంది జర్నలిస్టులతో ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సహజంగా అంతమంది ఒక్కచోట చేరినప్పుడు భావోద్వేగాలు ఎలా ఉంటాయి ?ఆ ఊపులో ఏదైనా సాధించగలమని అనుకుంటారు.అలాగే ఈ మధ్య ప్రతిఒక్కరితో ఆచితూచి వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబుని తమ డిమాండ్స్ కి ఒప్పించడం తేలికే అనుకున్నారు.

జర్నలిస్ట్ సమావేశం తర్వాత ఓ ప్రతినిధి బృందం బాబుని కలిసి ఇళ్ల స్థలాల తో పాటు తమ డిమాండ్స్ వినిపించారు.అవి తీరిస్తే మా యూనియన్ లోని 5 వేల మంది విలేకరులు మీతో ఉంటారని చెప్పి ఓ సీనియర్ జర్నలిస్ట్ బాబుకే బిస్కెట్ వేద్దామని చూసాడు.కానీ బాబు సమాధానంతో వారు షాక్ తిన్నారు.”ఇన్నాళ్లుగా రాజకీయాల్లో వున్నాను.ఎప్పుడు ఎవరికి ఏమి చేయాలో తెలుసు.పైగా మీరు చెప్పినట్టు ఈ ఐదు వేల మంది నాకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు.సాక్షి విలేకరులు మేనేజ్ మెంట్ మాట కాదని మాకు అనుకూలంగా వార్తలు రాయగలరా ? అన్ని పత్రికలూ,ఛానెల్స్ లో ఇదే పరిస్థితి కదా..ఇవన్నీ నాకు తెలుసు. పరిస్థితిని బట్టి ఎవరికి ఏమి చేయాలో చేస్తా ” అని బాబు చెప్పడంతో జర్నలిస్టులు మౌనంగా బయటపడ్డారంట.

Post Your Coment
Loading...