విడిపోయినా ఒకటే మాట…అంతా పన్నీర్ మహిమ

Posted February 9, 2017 (3 weeks ago)

kamal hassan and gautami praise on o panneerselvam
కమల్ హాసన్,గౌతమి పెళ్లి చేసుకోకపోయినా సుదీర్ఘ కాలం సహజీవనం చేసి విడిపోయిన జంట.విడిపోయిన విషయం బయటకు చెప్పుకున్న ఆ జంట ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్న సందర్భం రాకుండా సంయమనం పాటించారు.విడిపోయినా తాము పడిపోలేదని చెప్పేందుకా అన్నట్టు అప్పటినుంచి ఆ ఇద్దరూ సామాజిక అంశాల పట్ల చురుగ్గా స్పందిస్తున్నారు.జల్లికట్టు విషయంలో కమల్,జయ మరణం విషయంలో గౌతమి సోషల్ మీడియా వేదికగా ఎంతగా మాట్లాడారో అందరూ చూశారు.బయటికి నేరుగా చెప్పకపోయినా గౌతమి వైఖరి బీజేపీ కి అనుకూలంగా కనిపిస్తూ వచ్చింది.కమల్ తో విబేధాలకు ఆమె రాజకీయ ఆకాంక్ష కూడా ఓ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.అందులో నిజానిజాలు ఏమిటో బయటకు రాకపోయినా ఇద్దరూ ఒకే అంశంపై,ఒకే విధంగా స్పందించింది లేదు.అంటే వైరుధ్యాలు కొనసాగుతున్నట్టే అనిపించింది.

పన్నీర్ మహిమతో కమల్ హాసన్,గౌతమి ఒకటే మాట మీద కొచ్చారు.రాజకీయంగా ఒకటే బాటలో నడిచేలా కనిపిస్తున్నారు.తమిళ రాజకీయ పోరాటంలో శశికళకి వ్యతిరేకంగా పన్నీర్ కి అనుకూలంగా కమల్,గౌతమి ఒకే రకమైన ప్రకటనలు చేస్తున్నారు.సీఎం పీఠమెక్కేందుకు శశికి వున్న అర్హతల్ని ప్రశ్నిస్తున్నారు.ఏదేమైనా పన్నీర్ మహిమతో ఒక్కటే మాట మీదకి వచ్చిన కమల్,గౌతమి మళ్లీ ఒక్కటైతే చూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY