కమల్ పొలిటికల్ ఎంట్రీ?

Posted February 7, 2017 (3 weeks ago)

kamalhassan political entry
సూపర్ స్టార్ కమల్ హాసన్ రాజకీయాల్లోకి రానున్నారా? ఇన్నాళ్లూ డైలమాలో ఉన్న ఆయన తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.

పాలిటిక్స్ పై ఎప్పుడూ డైరెక్ట్ గా మాట్లాడని కమల్ హాసన్ ఇప్పుడు హఠాత్తుగా స్వరం పెంచారు. అది కూడా శశికళను టార్గెట్ చేస్తూ ఆమెకు వార్నింగే ఇచ్చారు. సామాన్యుడి సహనాన్ని పరీక్షించవద్దంటూ హెచ్చరించారు. గడ్డిపోసలన్నీ కలిస్తే… మదగజాన్ని బంధించగలవని పరోక్షంగా శశిపై విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే కమల్ నోట ఇలాంటి మాటలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

తమిళనాడులో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉంది. కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి వారికి ఇదో సువర్ణావకాశం. దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ వీరిద్దరనీ రాజకీయాల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. రజినీ కాంత్ స్పష్టంగా నో అని చెప్పినప్పటికీ… కమల్ మాత్రం డెసిషన్ పెండింగ్ లో పెట్టారు. జయ మరణం తర్వాత ఆయన చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ఇదే మంచి తరుణమని ఆయన భావిస్తున్నారు. ఒక జాతీయ పార్టీ కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు వార్తలొస్తున్నాయి. బహుశా అదే పార్టీలో ఆయన చేరొచ్చని కూడా జరుగుతోంది.

కమల్ తో సంప్రదింపులు చేస్తున్న ఆ పార్టీ బీజేపీయేనన్న వాదన వినిపిస్తోంది. వెంకయ్యనాయుడుతో కమల్ టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లో అనుకోని పరిస్థితులు వచ్చేస్తే.. బీజేపీ తరపున సీఎం అభ్యర్థి ఆయనేనని జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY