షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న కంగనా

 Posted May 7, 2017 (4 weeks ago) at 18:26

kangana shocking decision
బాలీవుడ్‌లో ఫైర్‌ బ్రాండ్‌ హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు కంగనా రనౌత్‌. ఈ అమ్మడు గతంలో ఎన్నో సార్లు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈమె తెలుగు దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహించబోతున్న ‘మణికర్ణిక’ చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతుంది. విజయేంద్ర ప్రసాద్‌ రెడీ చేసిన వీరనారి రaాన్సీ లక్ష్మీభాయ్‌ కథాంశంతో కంగనా ఒక సినిమా చేస్తుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సమయంలోనే కంగనా రనౌత్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది.

‘మణికర్ణిక’ సినిమా తర్వాత కంగనా రనౌత్‌ మరో సినిమాను చేయకూడదని నిర్ణయించుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెళ్లడి చేసింది. తాను ‘మణికర్ణిక’ తర్వాత నటించకూడదని ఫిక్స్‌ అయ్యాను. తన 15వ ఏట నుండి నటిస్తున్నాను. ఇక నటనకు గుడ్‌ బై చెప్పి, దర్శకత్వం వైపు అడుగులు వేస్తానంటూ ఈమె పేర్కొంది. దర్శకత్వంలో మెలకువల కోసం కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకోనున్నట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా పిచ్చ క్రేజ్‌ ఉన్న ఈ సమయంలో కంగనా తీసుకున్న నిర్ణయం అందరికి షాక్‌ ఇస్తుంది.

Post Your Coment
Loading...