టెర్రరిస్ట్ గెటప్ లో కార్తీ!

Posted March 21, 2017

karthi cheliya movie trailer 2మణిరత్నం దర్శకత్వంలో  తెరకెక్కబోయే చెలియా సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ని కొద్ది సేపటి  క్రితమే విడుదల చేశారు. ఈ సినిమాలో కార్తీ,  అదితి రావ్ హైదరి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో  ఒకేసారి  ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. మద్రాస్ టాకీస్ బేనర్లో మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్న  ఈ చిత్ర తెలుగు వెర్షన్ ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.

ఫస్ట్ ట్రైలర్ లో ఆర్మీ ఆఫీసర్‌గా నీట్ లుక్ లో  కనిపించిన కార్తి సెకండ్ ట్రైలర్లో డిఫరెంట్ లుక్స్ లో దర్శనమిచ్చాడు. ఉగ్రవాదుల నుండి తప్పించుకునే క్రమంలో కార్తి టెర్రరిస్ట్ వేషం  కూడా వేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో  చెలియా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కార్తీ, అదితిరావ్ మధ్య  ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు కూడా చూడచక్కగా ఉన్నాయి. మొత్తానికి తాజాగా విడుదల చేసిన  ట్రైలర్ తోనే  మతిపోగొట్టేస్తున్నాడు మణిరత్నం.  

Post Your Coment
Loading...