అమ్మ బయటకి రాకముందే కరుణ సెగ ..

Posted [relativedate]

karunanidhi comment on cm jayalalitha
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాకముందే రాజకీయ కాక మొదలైంది.డీఎంకే నేత కరుణానిధి అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారు.నోట్ల రద్దు అంశాన్నే అయన ఆయుధంగా మలుచుకున్నారు.ఆస్పత్రిలో ఉండికూడా ఉపఎన్నికల్లో ఓటు వేయమని ప్రకటన ఇచ్చిన జయ నోట్ల రద్దు విషయం మీద ఎందుకు మాట్లాడారని కరుణ ప్రశ్నిస్తున్నారు.ఇదే విషయం మీద ఇంతకు ముందే స్టాలిన్ కూడా జయ మీద దాడి చేశారు.అయినా స్పందన లేకపోవడంతో కరుణ నేరుగా రంగంలోకి దిగారు.ఏమైనా అమ్మ ఆస్పత్రి నుంచి బయటికి కూడా రాకముందే కరుణ సెగ మొదలు కావడం తమిళనాడు రాజకీయ పరిస్థితులకి అద్దం పడుతోంది.