కాటమరాయుడు యాప్ వచ్చేసింది..

Posted March 18, 2017

katamarayudu app released by aditya musicపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , గ్లామర్ డాల్ శృతి హాసన్ జంటగా నటించిన కాటమరాయుడు మూవీ ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఆడియోకి విశేష స్పందన కూడా లభించింది. ఇప్పటివరకు విడుదల చేసిన పాటలను, టీజర్లను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు కాటమరాయుడు పేరుతో ఓ యాప్‌ ను విడుదల చేసింది ఆదిత్య సంస్థ.  ఈ ఆండ్రాయిడ్‌ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలంటే https://goo.gl/YW5C4C షార్ట్‌ లింక్‌ని క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకున్న తరువాత ఓపెన్‌ చేస్తే మ్యూజిక్‌, గ్యాలరీ, వీడియోలు, టోన్స్‌, లిరిక్స్‌ విభాగాలు కనిపిస్తాయని, అభిమానులకు  ఏది కావాలనుకుంటే దానిని ఎంచుకోవచ్చని సంస్ధ అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఆడియోని రింగ్‌ టోన్‌ గా పెట్టుకునే సౌకర్యం ఉంది. ఇందుకు రింగ్‌ టోన్‌ విభాగంలోకి వెళ్లి సెట్‌ యాజ్‌ రింగ్‌టోన్‌ అని పెడితే ఆటోమేటిగ్గా డౌన్‌ లోడ్‌ అయి మొబైల్‌ రింగ్‌ టోన్‌ గా సెట్‌ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం… కాటమరాయుడు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి… రింగ్ టోన్స్ ని, కాలర్ టోన్స్ ని సెట్ చేసేసుకోండి.

Post Your Coment
Loading...