కాటమరాయుడు రైట్స్ ని కొట్టేసిన నితిన్

Posted February 11, 2017 (2 weeks ago)

katamarayudu movie nizam rights taken by nitinపవర్ స్టార్ పవన్ కళ్యాణ్… అబ్బో ఈ పేరుకున్న పవర్ అంతా ఇంతా కాదు. రీసెంట్ గా రిలీజైన కాటమరాయుడు ట్రైలర్ తో ఆయన కెపాసిటీ ఏంటో మరో సారి ప్రూ అయ్యింది.

డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మూవీ ప్రారంభం కాకముందే  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత   ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని నమోదు చేసి కలెక్షన్లపరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. దీంతో పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మెగా హీరోలకి మంచి పట్టున్న నైజాం ఏరియాలో ఈ పోటీ తారా స్థాయికి చేరుకుంది. అంతటి గట్టి పోటీని తట్టుకుని పవన్ వీరాభిమాని, యంగ్ హీరో నితిన్ ఆ హక్కుల్ని దక్కించుకోడం విశేషం. ఈ విషయాన్ని నితినే ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఒక్క ట్రైలర్ తోనే రికార్డుల దుమ్ము దులిపేసిన కాటమరాయుడు విడుదల తర్వాత ఇంకెంత సునామీ సృష్టిస్తాడో  చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY