కొత్తలుక్ లో కాటమరాయుడు..!!

Posted February 8, 2017 (3 weeks ago)

katamarayudu new look releaseరీసెంట్ గా విడుదల చేసిన కాటమరాయుడు టీజర్ కేవలం 57 గంటల్లో 5 మిలియన్ వ్యూస్  సాధించి తెలుగు సినిమా టీజర్ రికార్డులను తిరగరాసి సంచలనాలు సృష్టిస్తోంది. దీంతో పాటుగా కాటమరాయుడు సినిమాకు సంబంధించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ స్టిల్స్ కూడా  సోష‌ల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి. ఇక విడుదలైన పోస్టర్స్, టీజర్  తో అసలుసిసలైన ఫ్యాక్ష‌నిస్ట్ ఎలా ఉంటాడో కాట‌మ‌రాయుడులో చూపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది.  దీంతో సినిమాకు సంబంధించిన పవన్ విషయాలు ఏమైనా  బయటకువస్తాయోమో అన్న  క్యూరియాసిటీ  పవన్ అభిమానుల్లో బాగా పెరిగిపోయింది. ఇది గమనించిన కాటమరాయుడు చిత్రబృందం ప‌వ‌ర్ స్టార్ మ‌రో లుక్ విడుదల చేసింది.

కోర మీసంతో సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్న  ప‌వ‌న్ ని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతూ షేర్లు, లైక్ లు కొట్టేస్తున్నారు.  ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిన కాటమరాయుడు అన్ని పనులను పూర్తిచేసుకుని మార్చిలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. అప్పటివరకు పవన్ అభిమానలు కాస్త ఓపిక పట్టకతప్పదు.

NO COMMENTS

LEAVE A REPLY