ట్రంప్ దారిలో నడుస్తున్న కేసీఆర్

 Posted May 2, 2017 (4 weeks ago) at 10:34

kcr behave like as trump he is not allowing media to municipal committee meetingతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. సరికొత్త ఆందోళనలకు తెర తీసేలా ఉంది.మున్సిపల్ సమావేశాలకు మీడియా ఎంట్రీకి నో చెబుతూ.. కవరేజీకి అనుమతించొద్దన్న అర్థం వచ్చేలా తెలంగాణ పురపాలక శాఖ విడుదల చేసిన అంతర్గత ఆదేశాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. ఉద్యమబాటలో నడిచి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక ఉద్యమ పార్టీ హయాంలో.. మీడియాకు అనుమతులు ఇవ్వొద్దంటూ జారీ చేసిన అంతర్గత ఆదేశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా ఆదేశాల ప్రకారం తెలంగాణలోని కార్పొరేషన్లు.. మున్సిపాలిటీలు.. నగర పంచాయితీల సమావేశాలకు మీడియాను అనుమతించరు. కౌన్సిల్ సమావేవాలకు మేయర్ లేదంటే ఛైర్మన్.. డిప్యూటీ మేయర్ లేదంటే డిప్యూటీ ఛైర్మన్.. కార్పొరేటర్లు లేదంటే కౌన్సిలర్లు.. మున్సిపల్ కమిషనర్.. వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు హాజరవుతుంటారు.ఇలాంటి సమావేవాలకు మీడియా ప్రతినిదులు హాజరు కావటం ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే.. ఈ సమావేశాలకు ప్రెస్ లేదంటే మీడియాను అనుమతించొద్దంటూ మున్సిపల్ పరిపాలన విభాగం ఆదేశాలిచ్చింది.

సమావేశ వివరాల్ని తర్వాత ప్రెస్ రిలీజ్ రూపంలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.ఈ ఆదేశాలపై పలువురు విస్తుపోతున్నారు. ఒక ఉద్యమ రాజకీయ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రంలో.. మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులు జారీ కావటం ఏమిటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఆదేశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసే జరిగాయా? లేక.. అధికారుల అత్యుత్సాహంతో జరిగాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Post Your Coment
Loading...