కేసీఆర్ సర్కార్ కి ఊరట ..123 జీవో కి లైన్ క్లియర్ ..

 kcr sarkar happy about high court 123 jeevo decision

వివాదాస్పంగా మారిన 123 జీవో పై అమలుకు లైన్ క్లియర్ చేసింది హైకోర్ట్. ఈ జీవో ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్…. 123 జీవోకు అనుబంధంగా ప్రభుత్వం ఫైల్ చేసిన 190,191 జీవోలను ఆమోదించింది. దీంతో మెదక్ లో నిమ్జ్ కోసం తలపెట్టిన భూసేకరణకు లైన్ క్లియర్ అయ్యింది.రాష్ట్రంలో 123 జీవో ఇంప్లిమెంటేషన్ పై ప్రభుత్వానికి హైకోర్ట్ ఊరట కల్పించింది.

ఈ జీవో కింద మెదక్ లో చేపట్టిన భూసేకరణలో బాధితుల పునరావాసం, ఉపాధి, నష్టపరిహారాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఫైల్ చేసిన అదనపు జోవో 190,191లతో సంతృప్తి చెందింది ధర్మాసనం. 123 జీవోకు అనుబంధంగా జారీ చేసిన ఈ జీవోలతో…. మెదక్ నిమ్జ్ కు భూరిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది డివిజన్ బెంచ్.

ఐతే భూములు అమ్మిన వారికి పూర్తిగా నష్టపరిహారం పరిహారం చెల్లించడంతో పాటు జీవో 190,191 లో పేర్కొన్న విధంగా అన్ని విధివిధానాలను అమలు చేసిన తరువాతనే…. ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని హైకోర్ట్ అర్డర్స్ పాస్ చేసింది. ఈ జీవోను ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం నిబంధనలు అతిక్రమిస్తే భాధితులు కోర్టును అశ్రయించవచ్చని తీర్పు చెప్పింది ధర్మాసనం. దీంతో జీవో నెంబర్ 123 కింద భూసేకరణకు మార్గం సుగుమం అయ్యింది.

Post Your Coment
Loading...