KCR సర్కార్ కు రిలీఫ్…

 kcr sarkhaar relief

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. 123 జీవోను రద్దు చేస్తూ సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. వ్యవసాయ కూలీలకు పరిహారానికి సంబంధించి సవరణలతో కూడిన జీవోను తమ ముందు ఉంచాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది డివిజన్ బెంచ్.

పిటిషనర్‌కు ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు న్యాయవాది అరుణ్‌కుమార్‌. పిటిషనర్‌ 196 ప్రశ్నలను కోర్టు ముందు ఉంచారు. వాటిపై ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు. ప్రభుత్వ అఫిడవిట్‌పై హైకోర్టు, పిటిషనర్‌ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటు చేసేటప్పుడు చిన్నచిన్న తప్పులను భూతద్దంలో చూడొద్దని హైకోర్టు పేర్కొందని తెలిపారు. అఫిడవిట్‌ రూపంలో స్వీకరించలేం కాబట్టి జీవోను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిందన్నారు.

Post Your Coment
Loading...