పంతుళ్ల కు కెసిఆర్ షాక్…

Posted December 16, 2016

property values should showఇందుగలడని ..అందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అంటూ ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కశపుడికి చెప్తాడు ఐతే ఈ స్తంభం లో ఉన్నాడా అని స్తంభం పగల కొడతాడు ఆ వెంటనే శ్రీ హరి వచ్చి సంహ రించటం జరుగుతుంది …ఐతే ఈ పురాణం కాలక్షేపం ఇప్పుడెందుకు అనేదే డౌట్ కదా ?..తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులు వెల్లడించాలని స్ట్రాంగ్ గా ఉత్తర్వులు ఇచ్చింది..ఈ మధ్య కాలం లో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేని వ్యాపారం, వ్యవహారం లేదు అనే చెప్పాలి ఈ మత్తు లో పడి అసలుకే మోసం వచ్చేలా బడి ఎగ్గొట్టి సొంత పనుల్లో బిజీ ఐపోవడం ఫలితం గా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పడి పోవడం, మరి కొందరు ఏకం గా స్వంత కాలేజీలు, స్కూల్స్ ఏర్పాటు చేసుకొని వాటి మీద దృష్టి పెట్టటడం జరుగుతోంది..

తాజా గా ప్రభుత్వం ఆస్తులు వివరాలను వెల్లడించాలి అనే నిబంధనను కఠినతరం చేయడంతో ఎప్పుడు ఈ తరహా ఉపాధాయుల్లో ఆందోళన మొదలు అయ్యింది అనే చెప్పాలి, 2017 జనవరి 10వ తేదీ వరకు గడువు విధించింది. ఈ మేరకు డిసెంబరు 2వ తేదీనే జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీలకు విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకుచావండి అన్నట్టుగా ప్రభుత్వం తీరు వుంది.ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1998లో జీవో (నంబరు 52)ను జారీచేసింది. అయితే దీన్ని ఎన్నడూ అమలు చేయలేదు. ఈ నిర్ణయం పట్ల కొందరి ఉపాధ్యాయుల్లో సంతోషం కూడా వ్యక్తం అవుతోంది, ఇన్ని రోజులు అడిగే వాడు లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు బడికి పంగనామం పెట్టి నా ఇదేమని అడిగే దైర్యం చేయలేక పోయామని ఇప్పుడు తిక్క కుదిరే సమయం వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం రూపొందించిన డిక్లరేషన్ లో ఇలా…
డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన ఆస్తుల వివరాలు (టీచర్లు, డిపెండెంట్స్‌ సహా)
బ్యాంకుల్లో డిపాజిట్లు, నాన్‌బ్యాంకింగ్‌ లావాదేవీలు (చీటీలు వగైరా)
వివిధ కంపెనీల్లో బాండ్లు, డిబెంచర్లు, షేర్లు
ఎన్‌ఎస్‌ఎస్‌, పోస్టల్‌ సేవింగ్స్‌, ఎల్‌ఐసీ పాలసీ తదితరాలు
వాహనాలు (టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ తదితరాలు)
అభరణాల మొత్తం విలువ (బరువు సహా)
వ్యవసాయ భూమి వివరాలు (విస్తీర్ణం, సర్వేనంబరు సహా)
సాగేతర భూమి వివరాలు (విస్తీర్ణం, సర్వేనంబరు సహా)
నివాస, వాణిజ్య భవనాలు (విస్తీర్ణం, సర్వేనంబరు సహా)
ఇళ్లు, అపార్ట్‌మెంట్లు (విస్తీర్ణం, సర్వేనంబరు సహా)
ప్రకటించిన ఇతర ఆస్తులు, వాటిపై ఆదాయం
బ్యాంకుల లావాదేవీలు, బకాయిల వివరాలు
బ్యాంకులో లోన్లు.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్లు
ప్రభుత్వశాఖలకు ఉన్న బకాయి వివరాలు(టెలిఫోన్‌, వాటర్‌, విద్యుత బిల్లులు)
ప్రభుత్వ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన బకాయిలు (విమాన, హెలికాప్టర్‌ చార్జీలు)
ఆదయపన్ను చెల్లింపు వివరాలు (రిటర్న్స్‌ దాఖలు చేసిన నాటికి పాన్‌ నంబరుతో సహా)

Post Your Coment
Loading...