కేజ్రీ వాల్..మోడీ భజన చేస్తాడట..

Posted December 5, 2016

arvind_modiమోదీ.. మోదీ అని భజన చేస్తానని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ నాశనమవుతోందని పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం నిర్మూలన జరిగితే అప్పుడు తానూ కూడా మోడీ జపం చేస్తానని నోట్ల రద్దు వల్ల కార్మికులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పలువురు ఉపాధి కోల్పోతున్నారు.. కానీ పీఎం మాత్రం పలుమార్లు దుస్తులు మార్చుకోవడంలో తీరికలేకుండా ఉన్నారని తీవ్రంగా విమర్శించారు

‘మోదీజీ.. మీరు ఏదైతే చెప్తున్నారో ముందు దాన్ని మీరు పాటించాలి’ అని హితవు పలికారు. ‘మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ అభియాన్‌, యోగా దినోత్సవం, సర్జికల్‌ స్ట్రైక్స్‌ను స్వాగతించాం. కానీ నోట్ల రద్దుపై ఆయన తీసుకున్న నిర్ణయం తప్పుగా ఉంది, అందుకే ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అని

భాజపా 80 శాతం విరాళాలు నగదు రూపంలో తీసుకుంటుండగా, ఆప్‌ 92 శాతం పార్టీ విరాళాలను చెక్కులు, ఇతర మార్గాల ద్వారా తీసుకుంటుందన్నారు. రూ.2.5లక్షలు మాత్రమే పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇస్తామని మోదీ మంత్రులు, ఎంపీల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు రూ.2.5లక్షలే వినియోగిస్తున్నారా అని అంటున్నారు చూద్దాం ఎవరి జపం ఎవరు చేస్తారో ..

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY