పవన్ ఇంటికి కిరణ్?

Posted [relativedate]

kiran kumar reddy join pawan kalyan janasena party
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జనసేన లోకి చేరడం ఖాయమేనని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీలో తనతో కలిసి పనిచేసిన ముఖ్యనేతల తో అయన బెంగళూరు లో రహస్య సమావేశం జరిపినట్టు సమాచారం.అక్కడే జనసేన విషయాన్ని చెప్పి తనతో రావాల్సిందిగా వారిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది.ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పిన వారిలో కొందరు కాంగ్రెస్ ముఖ్యులు ఉన్నట్టు చెబుతున్నారు.రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని పవన్ పార్టీని ఎందుకు ఎంచుకున్నది కూడా కిరణ్ వివరించారట.విభజన చేసి కాంగ్రెస్.హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేశాయని …వారికి అప్పట్లో వైసీపీ ,ఇప్పుడు టీడీపీ వంత పడుతున్నాయని కిరణ్ చెప్పారట.అందుకే ఆ నాలుగు పార్టీలకి దూరంగా వుండాలనుకున్నట్టు కిరణ్ తెలిపారట.ఒక వేళ వారిలో ఎవరితో కలిసినా పాత పాప భారాన్ని మోయాల్సి ఉంటుందని కిరణ్ భయపడ్డారని తెలుస్తోంది.అందుకే ఆ నాలుగు పార్టీలనుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ జనసేన వైపు మొగ్గినట్టు కిరణ్ చెప్పినదానికి అనుచరులంతా అంగీకారం చెప్పారట.

ఇక జనసేన అధినేత పవన్ తో ఇప్పటికే కిరణ్ మంతనాలు పూర్తి అయ్యాయని తెలుస్తోంది.ఈ నెల 23 న అయన నేరుగా హైదరాబాద్ లో పవన్ ఇంటికెళ్లి జనసేనలో చేరతారని సమాచారం.ఆ తర్వాత కిరణ్ అనుచరులు చేరే సమయంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలుస్తోంది .