కిరణ్ జనసేన లోకి?

 Posted November 6, 2016

Kiran kumar reddy shifting to janasena
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ మార్గంపై స్పష్టత వస్తోంది.ఇటీవల సొంత నియోజకవర్గానికి వెళ్ళినపుడు అయన అనుచరులతో పెళ్లి కూతురు ఖరారైంది ..ముహూర్తమే మిగిలి వుంది అని చెప్పారు.ఆ పెళ్లి కూతురు జనసేన అని సమాచారం. ఈ మేరకి పవన్, కిరణ్ మధ్య రెండుమూడు విడతల చర్చలు జరిగాయని తెలుస్తోంది.ఆ చర్చల్లో జనసేనలోకి వచ్చేందుకు కిరణ్ అంగీకరించడమే కాకుండా పార్టీ వ్యూహ రచనలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారట.ఈ నెల 23 న కిరణ్ కొత్తపార్టీలో చేరొచ్చని సమాచారం.
BJP,కాంగ్రెస్,టీడీపీ ఇలా అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వున్నా పాత పార్టీల తప్పుల్ని మోయడం కన్నా కొత్త పార్టీలోకి వెళ్లడం మేలని కిరణ్ భావించారట.పవన్ జనబలానికి తన వ్యూహాలు తోడైతే మంచి ఫలితాలు సాధించగలమని కిరణ్ ఆలోచనగా ఉన్నట్టు చెప్తున్నారు.ఇదే నిజమైతే రాజకీయాల్లో ఇదో సరికొత్త కాంబినేషన్ అని చెప్పక తప్పదు.

Post Your Coment
Loading...