వంగవీటి,వర్మ మధ్య సంధికి ఛాన్స్?

Posted December 3, 2016

Displaying vanga.jpg
వంగవీటి రాధా,రాంగోపాల్ వర్మ మధ్య తొలివిడత చర్చలు ఫెయిల్ అయ్యాయి.అయితే సీన్ అంతటితో కట్ అయిపోయినట్టు కాదంట.వీరి మధ్య సంధి కుదర్చడానికి మరో ప్రయత్నం మొదలైంది.ఈసారి కూడా వైసీపీ నేత కొడాలి నాని వీరి మధ్య సంధి కోసం ఇంకో ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది.మొదటి దఫా చర్చలు విఫలమైన వెంటనే ఇంకో రెండుమూడు సార్లు కూర్చుంటే ఓ అభిప్రాయం కుదరొచ్చని నాని అన్నారు.అనడమే కాదు ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేసారంట.సినిమాని ఓ రహస్య ప్రదేశంలో వంగవీటి రాధా,రత్న కుమారి కోసం సినిమా షో వేసి అప్పుడు వారి అభిప్రాయాల్ని వినాలని వర్మకి నాని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే వర్మ దానికి ససేమిరా అంటున్నారట.దీంతో నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వైపు నుంచి నరుక్కురావడానికి నాని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Image result for kodali nani

అసలు వంగవీటి రంగ ప్రధాన పాత్ర గా వస్తున్న సినిమా మీద అయన భార్య,కుమారుడు ఈ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎందుకన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.రెండు కులాల మధ్య మళ్లీ ఈ సినిమా చిచ్చు రగులుస్తుందని వంగవీటి కుటుంబ సభ్యులు భావిస్తున్నారట ..అది మంచిది కాదనే ఈ అభ్యంతరాలు పెడుతున్నట్టు సమాచారం.అయితే రాధారంగా మిత్ర మండలి లో కొందరు,దేవినేని నెహ్రు లాంటి వాళ్ళు దీనిపై పెద్దగా అభ్యంతరాలు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ పరిస్థితుల్లో కొడాలి చేసే మరో సంధి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Post Your Coment
Loading...