KCR కి నయీంతో పోలికా?

Posted December 1, 2016

Image result for kcr and kodandaram
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కోదండరామ్ మధ్య కోల్డ్ వార్ మరింత పెరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో కోదండరామ్ … ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నారు. అదే పనిగా సర్కారు ఏకపక్ష వైఖరిని ఎండగడుతున్నారు. రోజురోజుకు విమర్శల దాడిని మరింత పెంచుకుతున్నారు.

ఇటీవల ఓ నిర్వాసితుల సదస్సులో పాల్గొన్న కోదండరామ్.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను నయీంతో పోల్చారు. నయీం లాగే పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి ప్రాజెక్టులు అవసరమే కానీ.. మరీ ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు.. ప్రజల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం ఏంటని నిలదీశారు.

కోదండరామ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోంది. ఆయన కాంగ్రెస్ ట్రాప్ పడిపోయారన్న వాదన వినిపిస్తోంది. నిజానికి కోదండరామ్ ప్రభుత్వానికి సూచన చేయదలుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. డైరెక్టుగానే సీఎం కేసీఆర్ ను కలవొచ్చు కదా సూచిస్తున్నారు. అటు కోదండరామ్ మాత్రం సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదని చెబుతున్నారు.

Post Your Coment
Loading...