ఆ జిల్లాలో రౌడీలు, మాజీ నక్సలైట్లే ఎమ్మెల్యేలు

Posted May 20, 2017 (2 weeks ago) at 09:55

komatireddy venkat reddy fires on kcr orange market fightతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు రాష్ట్ర మంత్రి హరీశ్ రావుతో తాను కుమ్మక్కు కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా జరిగిన గొడవను పక్కదారి పట్టించేందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. మంత్రి హరీశ్ రావు తాను కుమ్మక్కై ఈ గొడవ సృష్టించామని టీఆర్ ఎస్ నాయకులే దుష్ప్రచారం చెయ్యడం దారుణమని అన్నారు.

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రౌడీలు మాజీ నక్సలైట్లే ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా నల్లగొండలో జరిగిన గొడవ వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలం ఉందని భావిస్తున్నానని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణితో సహా టీఆర్ ఎస్ నేతలపై రేపటిలోగా కేసులు నమోదు చెయ్యకపోతే హైకోర్టును ఆశ్రయిస్తా౦. దీంతోపాటు ఈ ఘటనకు కారణమైన కొంతమంది పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం నేరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎక్కడా ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమమున్నచోట తెరాస మీటింగ్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. నకిరేకల్ ఎమ్మెల్యే భార్య ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు. 26 మంది కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు ఒక్క తెరాస కార్యకర్తను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

Post Your Coment
Loading...