కొమ్మినేని గారూ..జగన్ తో జర జాగ్రత్త

Posted April 25, 2017 at 11:56

kommineni be aware of jagan
ఓ జర్నలిస్టు గా ఈ మధ్య కాలంలో కొమ్మినేని శ్రీనివాసరావు అంత వివాదాస్పదం ఎవరూ కాలేదు.టీవీ 9 రవి ప్రకాష్ లాంటి వాళ్ళ మీద విమర్శలు వచ్చినా వాళ్ళు కేవలం జర్నలిజానికి మాత్రమే పరిమితం కాకుండా మీడియా సంస్థ నిర్వహణలో భాగం అయ్యినవాళ్లు.కొమ్మినేని మాత్రం ఏ సంస్థలో పనిచేసినా జర్నలిస్ట్ బాధ్యతలకు పరిమితమయ్యారు.ఆయనకి,టీడీపీ కి మధ్య వైరుధ్యం గురించి అందరికీ తెలిసిందే.అలాంటి ఆయన తాజాగా చంద్రబాబు కోడలు బ్రాహ్మణి గురించి తన వెబ్ సైట్ లో కామెంట్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

లోకేష్ ప్రసంగాల మీద చర్చ సాగుతున్న వేళ ఆయన్ని తక్కువ చేయడానికా అన్నట్టు బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థ కార్యక్రమంలో చేసిన ప్రసంగం మీద కొమ్మినేని ప్రశంసలు కురిపించారు.ఉచ్చారణ,విషయం మీద స్పష్టత లో బ్రాహ్మణిదే పై చేయి అని కొమ్మినేని తేల్చారు.పైగా ఆ బాబు,లోకేష్ మాట్లాడడానికి ఇష్టపడని సాక్షి ఛానల్ ప్రతినిధులతో కూడా బ్రాహ్మణి బాగానే మాట్లాడింది కాబట్టి ఆమెకి కితాబులు ఇచ్చేసారు కొమ్మినేని.

కానీ జగన్ వ్యవహారశైలి తెలిసిన కొందరు కొమ్మినేని గారూ జర జాగ్రత్త అంటున్నారు.లోకేష్ ,బాబు ని తక్కువ చేయడానికి బ్రాహ్మణి ని పొగిడితే జగన్ కి కోపమొస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు వెళితే మంచిదని కొమ్మినేనికి ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు.

Post Your Coment
Loading...