ఇదంతా నిజమైతే ..కృష్ణా,గుంటూరు గొప్పే ..

0
360

 krishna guntur districts greatమనిషికి ఆకలి ,అవసరాలు తీరగానే …ఎంతకీ తీరని ఓ కాంక్ష పుట్టింది..అది మరేంటో కాదు నేనే గొప్ప అనే ఆలోచన…అతిశయం …అయితే వీటికి కాలానుగతంగా కులం,మతం,ప్రాంతం అనే ముసుగులు కూడా వచ్చి చేరాయి.లోపల ఉన్న ఇగో కి ఇవి రక్షాబంధనాలుగా ఉపయోగపడుతున్నాయి.అయితే అన్నిసార్లు ఈ నేను గొప్ప అనే అహం చెడు మాత్రమే చేయకపోవచ్చు.ఒక్కోసారి సాటివారిలో స్ఫూర్తిని కూడా నింపవచ్చు.ఉన్న విషయాన్ని తీసుకునే దాన్ని బట్టే ఫలితం .

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే సోషల్ మీడియా లో ఓ సమాచారం హల్చల్ చేస్తోంది .అది కృష్ణా,గుంటూరు జిల్లాల గొప్పదనాన్ని ప్రచారం చేస్తోంది..అందులో నిజానిజాల నిగ్గు తేల్చాలంటే అన్ని రంగాల నిపుణులు అవసరమే..అదంత తేలిగ్గా అయ్యే పని కాదు.కానీ సదరు సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది.అందులో వున్నదంతా నిజమైతే కృష్ణా,గుంటూరు జిల్లాలు గొప్పని ఒప్పుకోవాల్సిందే ..ఆ సమాచారం తెలుగుబుల్లెట్ వీక్షకుల కోసం అందిస్తున్నాం ..చదవండి …అందులో నిజానిజాల్ని మీరే బేరీజు వేసుకోండి..

ఇదే పుష్కరం హ్యాంగోవర్ లో అంటున్నమాట కాదు. అంతకు మించిన సంగతే ఉంది. క్రిష్ణా గుంటూరు జిల్లాల మాట వినగానే ఏం చెప్పక ముందే అబ్బో… అనే సౌండ్ వస్తుంది కదా ! అలా ఎందుకొస్తుందో తెలియాలంటే మీరు కచ్చితంగా ఇది చదవాల్సిందే ! ఉన్నసంగతేంటో కొన్ని బుల్లెట్ పాయింట్స్ లా ఉంది. చకచకా చదివేయండి.

దేశంమొత్తంమ్మీద క్రిష్ణా జిల్లానే టాప్. ఇండియా జీడీపీ 7.5 శాతం. ఏపీ జీడీపీ 11.99 శాతం. క్రిష్ణాజిల్లా జీడీపీ 12.89 శాతం. తలసరి ఆదాయంలో క్రిష్ణాది రాష్ట్రంలో సెకండ్ స్పాట్. 1,40,593 రూపాయలు. గుంటూరుదైతే 1.04 లక్షలు. దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యంలో క్రిష్ణా గుంటూరు జిల్లాల వాటా7.6 శాతం. దేశంలోనే ఈ రెండు జిల్లాలదే టాప్ పొటిషన్. క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 2960 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ జిల్లాల నుంచి వెళ్లిన వాళ్లలో 460 మంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టైకూన్ లుగా ఉన్నవాళ్లే !

 పొగాకు, పసుపు, మిర్చిలో ఆసియా దేశాలకి ఎగుమతి చేసే మోస్ట్ వాంటెడ్ సెంటర్ గుంటూరే. ఇక్కడి నుంచి వచ్చే ఉత్పత్తుల్ని మయన్మార్, సింగపూర్, మలేషియా, ధాయ్ లాండ్ ప్రత్యేకంగా తీసుకొంటాయ్. వాహనాల వాడకంలోనూ క్రిష్ణా, గుంటూరులే టాప్. టూవీలర్, ఫోర్ వీలర్ అన్నీ కలిపి ఈ రెండు జిల్లాల్లో 196 షోరూమ్ లు ఉన్నాయ్. ఇందులో 44 కార్ల కంపెనీ షోరూమ్ లే ! రూరల్ జిల్లాల్లో ఇంత మార్కెట్ ఉన్న ఒకేఒక్క ఏరియా ఇదే. దేశంలోనే ఇది రికార్డ్.
25 లక్షల వాహనాలున్నాయ్ కాబట్టి ఏపీలో ఎక్కువగా ఫ్యూయెల్ వాడుతున్నది కూడా ఈ రెండు జిల్లాలే !

కేరళ తర్వాత దేశంలో ఎక్కువమంది ఎన్నారైలు ఉన్న ప్రాంతం క్రిష్ణా, గుంటూరు జిల్లాలే ! 29500 మంది ప్రవాసులున్నారు రెండు జిల్లాల్లో ! జిల్లాల వారీగా తీస్తే… ఇది దేశంలోనే టాప్ ! దేశం మొత్తంమ్మీదా వైద్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు క్రిష్ణా గుంటూరు. ఈ రెండు జిల్లాల్లో 12600 డాక్టర్లున్నారు. ఇంతమంది మరెక్కడా లేరు. అమెరికాలో ఉన్న తెలుగు డాక్టర్లలో కూడా వీళ్లే ఎక్కువ. ఇంటర్నెట్ వినియోగంలో ఏపీలో క్రిష్ణా గుంటూరు జిల్లాలే టాప్. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 36 శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు.

గుంటూరు జిల్లాలో 29 గ్రామాల రైతులు… 33 వేల ఎకరాలు స్వచ్చందంగా రాజధానికి కోసం ఇచ్చారు. అందులో 8 వేల ఎకరాలు రైతు కుటుంబాలకి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది. తిరిగి ఇస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భూ సమీకరణ. క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 28 జలవిద్యుత్కేంద్రాలున్నాయ్. ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం కావడంలో వీటి పాత్ర చాలా కీలకం . క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో సరిగ్గా 28 సిమెంట్ కంపెనీలు కూడా ఉన్నాయ్. నిర్మాణానికి ఇవే మూలస్తంభాలు.

1954 నుంచి 140 మంది తెలుగువాళ్లకి పద్మశ్రీలు వస్తే…అందులో 45 మంది క్రిష్ణా గుంటూరు జిల్లాల వాళ్లే ! 18 పద్మవిభూషణ్ లు వస్తే అందులో ఐదుగురు క్రిష్ణా జిల్లాల వాళ్లే ! క్రిష్ణా గుంటూరు జిల్లాలు చదవుల్లోనూ టాపే ! గుంటూరులో 51 ఇంజినీరింగ్ కాలేజీలుంటే… క్రిష్ణాలో 39 ఉన్నాయ్. 690 ఇంటర్మీడియట్ కాలేజీలు, ఐదు వర్సీటీలూ ఈ జిల్లాల్లో ఉన్నాయ్ ఇక క్రిష్ణా గుంటూరు జిల్లాల నదీతీరాల్లో 438 గుళ్లూగోపురాలున్నాయ్. తమిళనాడులో కూడా ఇంత డెన్సిటీతో ఆలయాలు లేవ్.
సింపుల్ గా ఇదీ మేటర్ !

NO COMMENTS

LEAVE A REPLY