ముగింపు దశకు వచ్చిన పుష్కరాలు…

  krishna pushkaraalu closing days coming కృష్ణా పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. దీంతో పుష్కరస్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. విజయవాడలో పద్మావతిఘాట్‌, దుర్గాఘాట్‌..పవిత్రసంగమం ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం, సంగమేశ్వరం, వేదాద్రి, ముక్త్యాలలో భక్తుల స్నానాలు చేస్తున్నారు.
మరో వైపు గొందిమళ్ల‌, బీచుపల్లి, సోమశిల…నాగార్జునసాగర్‌, మట్టపల్లి, వాడపల్లికి భక్తులు పుణ్య స్నానం ఆచరిస్తున్నారు. ఇంకా వేలాది మంది భక్తులు రానుండటంతో హైదరాబాద్‌- కర్నూలు హైవేపై వాహనాల రద్దీ సాగుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Post Your Coment
Loading...