ఆడవాళ్ళూ యాంటీ బయో టిక్ తో జాగ్రత్త..

Posted November 11, 2016

ladies take care of using antibiotic medicineఇబ్బడి ముబ్బడిగా యాంటీ బయో టిక్ మందులు వాడటం వల్ల స్త్రీలలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంది అంటున్నారు వైద్యులు. వాడే ముందు వాటి అవసరాన్ని బట్టి వేసుకోవడం మంచిది ఉంది కదా అని వాడి ఆ తరువాత ఇబ్బంది పడే కంటే ప్రత్యామ్న్యాయం చూసుకోవడం బెటర్ కదా ..

పెరుగు, వెల్లుల్లిలాంటి పదార్థాల్లో ఆరోగ్యకరమైన ప్రొబయాటిక్‌ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఈ పదార్థాలు తినటం ద్వారా యాంటీబయాటిక్స్‌ వాడే పని లేకుండానే చిన్న చిన్న రుగ్మతలను నయం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ మందులు తప్పనిసరిగా వాడాల్సివస్తే ఆ సమయంలో ఈ పదార్థాలు ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఆ మందుల దుష్ప్రభావాలు శరీరంపై తక్కువగా ఉంటాయి.

యంటీబయాటిక్స్‌ వాడితే శరీరంలోని పీహెచ్‌ బ్యాలెన్స్‌ క్రమం తప్పుతుంది. దాంతో స్త్రీలల్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో వైద్యుల్ని కలిసే స్త్రీలు అప్పటికే ఏవైనా యాంటీబయాటిక్స్‌ వాడుతుంటే ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.

యాంటీబయాటిక్స్‌ కుటుంబ నియంత్రణ మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా కొన్ని సందర్భాల్లో ఆ మాత్రలు పనిచేయక స్త్రీలు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి యాంటీబయాటిక్స్‌ వాడే సమయంలో నోటి మాత్రలకు బదులుగా ఇతర కుటుంబ నియంత్రణా పద్ధతులను కూడా పాటించాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్‌ వాడితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అందుకే వీరి కోసం వైద్యులు ‘సేఫ్‌ యాంటీబయాటిక్స్‌’ సూచిస్తారు. కాబట్టి గర్భిణిలు, పాలిచ్చే తల్లులు దగ్గు, జలుబులాంటి సాధారణ రుగ్మతలకు గురైనప్పుడు సొంతంగా మందులు కొనుక్కుని వాడేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. అప్పుడే ఆ తల్లితోపాటు, బిడ్డ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది.

Post Your Coment
Loading...