టీఎస్‌ కేబినెట్లోకి మహిళా మంత్రి…!

 Posted November 7, 2016
lady minister in trs partyతెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్‌లో మహిళా మంత్రి లేదనే అపవాదు టీఆర్‌ఎస్‌పై ఉంది.. ఇప్పుడు దాన్ని తొలిగించుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రయత్నిస్త్తున్నట్లు తెలుస్తోంది. విజయశాంతి కాంగ్రెస్‌లోకి జంప్‌ అయిన తరవాత వాయిస్‌ ఉన్న మహిళా నాయకురాలెవరూ పార్టీలో లేరు.. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌ పేరున్న డీకే అరుణను పార్టీలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు… కీలకమైన హోం మంత్రి పద వి కూడా కట్టబెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు సమచారం. ప్రస్తుతం హోంమినిస్టర్‌గా ఉన్న నాయనికి పార్టీలో కీలక బాధ్యత ఇచ్చేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. దానితోపాటు వచ్చేసారి ముషీరాబాద్‌ నుంచి ఆయన కుటుంబసభ్యుల్లో ఎవరికైనా టికెట్‌ ఇచ్చేలా హామీ కూడా కేసీఆర్‌ నుంచి వచ్చినట్లు సమాచారం.
ఇప్పుడు అరుణకు అవకాశం ఇస్తే ఇటు మహిళా మంత్రి లేదన్న అపవాదుతోపాటు.. కీలక శాఖను ఇచ్చిన క్రెడిట్‌ కూడా కేసీఆర్‌కే వస్తుంది. దానితోపాటు పార్టీకి వాయిస్‌ ఉన్న నాయకురాలు దొరికినట్లే అని టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం సంబరపడుతున్నారట.. కేసీఆర్‌ ఏం చేసినా డబుల్‌ బొనాంజా లేనిదే అడుగు వేయరు కాబట్టే డీకే అరుణ కోరిన గద్వాల్‌ జిల్లా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.. వలసల దెబ్బతో ఇప్పటికే కుంగిపోయిన కాంగ్రెస్‌ మరి ఈ అంశాన్ని ఎలా హ్యాండి ల్‌ చేస్తారో.. ఒకవైపు జానారెడ్డి టీఆర్‌ఎస్‌ని పొగిడారని పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.. ఇప్పుడు అరుణ వెళ్లడానికి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఏం మంత్రం వేస్తారో వేచి చూడాలి..
Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY