లగడపాటి 2019 రిపోర్ట్ ఏంటి..?

 Posted May 2, 2017 (4 weeks ago) at 11:04

lagadapati meets chandrababu and says about andhra pradesh political survey detailsవిజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబును కలవడం చర్చకు, ఊహాగానాలకు తావిచ్చింది. అయితే, చంద్రబాబు చెవిలో లగడపాటి ఏదో చెప్పారనే ప్రచారం తాజాగా సాగుతోంది.తన భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం వ్యాపార కార్యకలాపాల నిమిత్తమే తాను చంద్రబాబును కలిశానని లగడపాటి చెప్పారు. టిడిపి నేతలు కూడా అదే చెప్పారు.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుకు లగడపాటి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై సానుకూలత ఉందని, 65 శాతం మంది ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని లగడపాటి చెప్పారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుపై 65 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారట.2014లో చంద్రబాబును చూసి ప్రజలు ఓటేశారని, కానీ 2019లో మాత్రం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలను కూడా చూసి ఓటేస్తారని చంద్రబాబును లగడపాటి హెచ్చరించారని తెలుస్తోంది.

2019లో మళ్లీ టిడిపి గెలవాలంటే పునర్విభజన ఓ మార్గమని లగడపాటి.. చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. చెడ్డపేరు ఉన్న ఎమ్మెల్యేలను సాగనంపేందుకు, కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు, రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి కొంతమంది అభ్యర్థులను మార్చేందుకు వీలుండటం.. ఇలా పలు కోణాల్లో ప్రజల్లో ప్రభుత్వం, ఎమ్మెల్యేల్లో ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని లగడపాటి సూచించారని తెలుస్తోంది.

Post Your Coment
Loading...