ఈ భూమి కి టైం దగ్గర పడిందా?

Posted November 18, 2016

less time to live on earth
లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మన కాళ్ళ కింద పడి వుంది కదా అని ఈ భూమిని ఇక లైట్ తీసుకోడానికి వీల్లేదట.దానికి టైం దగ్గరపడిందని…మనం వేరే దారి చూసుకోవాలని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మానవాళికి చేసిన హెచ్చరికల్ని తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదు.ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే భూమి ఇంకో వెయ్యేళ్ళకి మించి మనుగడ సాగించడం కష్టమట.అంటే మనుషుల లెక్కలో పదితరాలు మాత్రమే ఈ భూమి మీద ఉండగలవు.ఈలోగానే బతకడానికి మరో చోటు చూసుకుని షిఫ్టింగ్ పనులు మొదలెట్టాల్సిందే.ఆ ప్రాసెస్ లో ముందుగా అందరి దృష్టి వుంది అంగారకుడి మీదే.అక్కడ కూడా ఇంకో వందేళ్లలో ఇల్లు కట్టడం కష్టమేనని హాకింగ్ అంచనా.

ఆక్స్ ఫోర్డ్ యూనియన్ డిబేటింగ్ సొసైటీ లో ‘విశ్వం ..మానవాళి పుట్టుక’ అనే అంశం మీద హాకింగ్ మాట్లాడారు.టైం దగ్గరపడిన భూమి గురించి కన్నా ఆకాశంలో కనిపించే నక్షత్రాలు,అంతరిక్షం మీద మానవాళి పరిశోధనలు విస్తృతం కావాలని అయన పిలుపునిచ్చారు.దాని వల్ల మాత్రమే మానవాళి మనుగడ నిలబెట్టుకోగలమని హాకింగ్ అభిప్రాయపడ్డారు.హాకింగ్ సూచనల్ని అంత తేలిగ్గా తీసుకోలేమని ఇప్పటికే పలు సందర్భాలు నిరూపించాయి.ఇప్పటికైనా సరిహద్దులు,దేశాలు,మతాలు పేరు చెప్పి కొట్టుకునేవాళ్లంతా రాబోయే ఉత్పాతాన్ని తట్టుకోవడం మీద దృష్టి సారించాలి.కలిసికట్టుగా మానవాళికి ఎదురయ్యే సవాల్ ని అధిగమించాలి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY