ఆ కూర వండాలంటే లైసెన్స్ తీసుకోవాలట .!

Posted November 24, 2016

licence required for fugu fish curryచేపకూరని వండాలంటే మాత్రం నాలుగేళ్లు ప్రత్యేక శిక్షణ తీసుకొని తర్వాత లైసెన్స్ తీసుకోవాలంట.లాగొసెఫలస్‌ జాతికి చెందిన పుఫ్పర్‌ ఫిష్‌ను జపాన్‌లో ‘ఫుగు’ అని పిలుస్తుంటారు. ఈ చేప వంటకం అంటే అక్కడి ప్రజలకు చాలా ఇష్టమట. అయితే.. దీన్ని వండాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే.. ఫుగు చేప విషపూరితం ఇది సైనైడ్‌ కన్నా 1200రెట్లు అధికంగా ప్రభావం చూపుతుందట. ఈ చేపను తింటే మనిషి కండరాల కదలిక ఆగిపోయి.. వూపిరి ఆడక చనిపోయే ప్రమాదం ఉంది.

అయినా ఈ చేపను తినడానికి జపనీయులు ఆసక్తి చూపుతుంటారు. అందుకే రెస్టారెంట్‌ యజమానులు ఫుగు చేపతో రుచికరమైన వంటలు చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన చెఫ్‌లను మాత్రమే నియమించుకుంటారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా… చెఫ్‌, తినేవారికి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది. ఫుగు చేపకూర తయారీ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మొదట ఫుగు చేప వంటకంలో మూడేళ్ల కోర్సు చేయాలి. ఆ తర్వాత చేపను గుర్తించడం, ముక్కలు చేయడం, వండటం, తినడం వంటి అంశాల్లో శిక్షణ పొంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే లైసెన్స్‌ ఇస్తారు. అలా లైసెన్స్‌ పొందిన చెఫ్‌లు మాత్రమే ఈ ఫుగు వంటకాన్ని తయారు చేయాలి. ఏది జపాన్ లో మాత్రమే దొరుకుతుంది ..

Post Your Coment
Loading...