దుమ్ముదులిపేయ్… బ్రహ్మాండంగా బతికేసేయ్

Posted December 30, 2016

life turning secretsఅనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని, ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు.అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి.

ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. అమ్మయ్య ఆనుకున్నాడు.

కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది.అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతను,తన తప్పు తెలసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

నీతి : ఈ ఆవులాగే మనమీద కుడా ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు. కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.

Post Your Coment
Loading...