మహేష్ టైటిల్‌ దసరాకి ఫిక్స్..

0
60

 mahesh murugadoss movie title announced dasaraమహేష్ బాబు – మురుగదాస్‌ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైద్రాబాద్‌లో శరవేగంగా సాగిపోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మహేష్ పుట్టినరోజున విడుదలవుతుందనే ప్రచారం జరిగింది. అయితే ఫస్ట్‌లుక్ జనవరిలోనే ఉంటుందని టీమ్ స్పష్టం చేసింది. తాజాగా అందిన సమాచారాన్ని బట్టి ఈ సినిమా టైటిల్‌ను మాత్రం దసరాకే విడుదల చేయాలని టీమ్ భావిస్తోందట. మురుగదాస్, కథకు సరిపడే ఓ మంచి టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేసేశారని.. కాకపోతే.. దసరాకి ఈ సస్పెన్స్‌కు తెరపడుతుందని చెప్తున్నారు.

ఈ నెలాఖరు వరకూ హైద్రాబాద్‌లోనే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్న చిత్రబృందం, సెప్టెంబర్ 6 నుండి చెన్నైలో షూటింగ్ స్టార్ట్ చేస్తుంది. సినిమా సగ భాగం షూటింగ్ పూర్తయ్యాక, జనవరిలో ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని మురుగదాస్ భావిస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్‌తో రకుల్ జోడీ కడుతోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY