జనవరి 1న మహేష్ గిఫ్ట్

Posted December 6, 2016

Mahesh Plans New Year Gift For Fansసూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా విషయంలో టైటిల్ పట్ల ఇంకా ఏమాత్రం క్లారిటీ రాలేదు. రెండు మూడు టైటిల్స్ బయటకు వచ్చినా వాటిలో ఫైనల్ టైటిల్ ఏదై ఉంటుందా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. ఈ క్రమంలో మహేష్ సినిమా జనవరి 1న టైటిల్ రివీల్ చేయబోతున్నారట. ఇక ఫస్ట్ లుక్ టీజర్ జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తారట. మహేష్ బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఈ సినిమాలో ఎంతో స్టైలిష్ గా ఉంటారని తెలుస్తుంది.

సౌత్ ఇండియా సూపర్ డైరక్టర్స్ లో మురుగదాస్ ఒకరు అలాంటి స్టార్ డైరక్టర్ తో మహేష్ ఇంతకుముందే నటించాల్సి ఉన్నా ఎందుకో కుదరలేదు. ఇక ఇప్పుడు భారీ అంచనాలతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అహ్మాదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ మురుగదాస్ సినిమా షూటింగ్ జరుగుతున్నా ఎలాంటి అప్డేట్ రావట్లేదని ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అందుకే వారికి టైటిల్ పోస్టర్ తో న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు మహేష్. మరి టైటిల్ పై ఏర్పడ్డ కన్ ఫ్యూజన్ అంతా తొలగిపోవాలంటే ఈ నెల మొత్తం వెయిట్ చేయక తప్పదు.

NO COMMENTS

LEAVE A REPLY