ఈశాన్య రాష్ట్రాల్లో మూత పడుతున్న ఫోర్త్ ఎస్టేట్…

Posted November 18, 2016 (3 weeks ago)

Manipur to Go Without Newspapers for Month
నోట్ల రద్దు సెగ ఫోర్త్ ఎస్టేట్ కు కూడా తగిలింది ఈ దెబ్బకు సమాచారం అందించే పత్రికలు సైతం మూతపడుతున్నాయి. కేంద్రప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ఈ రద్దు నిర్ణయంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పత్రికా కార్యకలాపాలు నిర్వహించడానికి డబ్బులు లేక, బలవంతంగా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని యాజమాన్యాలు వాపోతున్నాయి.

పరిస్థితులు సద్దుమణిగే వరకు మూత కొనసాగుతుందని కాంగ్లా పావ్ డైలీ సంపాదకుడు, యజమాని పోనమ్ లబాంగ్ మన్గ్యాంగ్ తెలిపారు. ప్రకటనదారుల వద్ద కొత్త కరెన్సీ నోట్లు రూ.500, రూ.2000 లేవని, యాజమాన్యాలు పాత నోట్లను తీసుకునేందుకు అంగీకరించడం లేదని మన్గ్యాంగ్ చెప్పారు.

అత్యవసరంగా నిర్వహించిన ఆల్ మణిపూర్ న్యూస్పేపర్స్ పబ్లిషర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పత్రికా కార్యాలయాలు మూసివేయాలని అక్కడి యాజమాన్యాలు నిర్ణయించాయి. చట్టపరమైన లావాదేవీలు జరిపే పొజిషన్లో కూడా లేకపోవడంతో గురువారం నుంచి ఆఫీసులు మూతవేయనున్నట్టు ఈ అసోషియన్ ప్రకటించింది. నగదు లేకపోవడంతో న్యూస్పేపర్ షట్టర్స్ సైతం మూతపడుతున్నట్టు పేర్కొంది.

జనవరిలో జరుగుబోయే ఎన్నికల్లో నోట్ల రద్దు దుర్బలమైన ప్రభావం చూపుతుందని, పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని అసలు ఊహించలేమని సీనియర్ బీజేపీ లీడర్ నిమాయిచంద్ లువాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి సరిపడ కరెన్సీని డిమాండ్ చేయడంలో విఫలమవుతుందని విమర్శించారు.

NO COMMENTS

LEAVE A REPLY