పోయెస్ గార్డెన్ లో చంద్రముఖి సినిమా?

 Posted May 4, 2017 (4 weeks ago) at 13:07

mannargudi mafia says big voice coming in jayalalitha home in poes garden
అప్పుడెప్పుడో గాడి తప్పిన రజని కెరీర్ ని సూపర్ హిట్ తో నిలిపింది చంద్రముఖి. ఓ సైకలాజికల్ డ్రామాకి దెయ్యం టచ్ ఇచ్చి చివరిలో మొత్తం సీక్రెట్ రివీల్ చేస్తే జనం ఆ సినిమాని విరగబడి చూసారు.ఇప్పుడు మన్నారుగుడి మాఫియా ఇదే సినిమా చూపిస్తోంది.కాకుంటే టార్గెట్స్ వేరు.జయ మరణం తర్వాత ఆమె నివాసం పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం శశికళ చేతుల్లోకి వెళ్ళిపోయింది.ఆమె జైలుకెళ్లాక శశి చుట్టం దినకరన్ చేతుల్లోకి వెళ్ళింది.ఆయన కూడా జైలుకి వెళ్ళాక ఇప్పుడు మన్నారుగుడి మాఫియాలో పైకి సేవకులుగా లోపల శశి గూఢచారులుగా పనిచేసే వాళ్ళ కిందకు వెళ్ళింది.పళనిస్వామి,పన్నీర్ సెల్వం వర్గాల మధ్య రాజీ వార్తలు వచ్చినప్పుడు ఓ విషయం బయటికొచ్చింది.పన్నీర్ వర్గం వేదనిలయాన్ని జయ స్మారక నిలయంగా మార్చి దాన్ని ప్రజలు చూసేందుకు అనుమతించాలని షరతు పెట్టినట్టు తెలుస్తోంది.దీంతో కలవరపడ్డ శశికళ మనుషులు ఓ ప్రచారం మొదలెట్టారు.

వేదనిలయంలో రాత్రిళ్ళు దెయ్యం అరుపులు వినిపిస్తున్నాయని మన్నారుగుడి మాఫియా ప్రచారం మొదలెట్టింది.జయ కి నచ్చని వాళ్ళు ఎవరు వచ్చినా ఆ శబ్దాలు తారాస్థాయిలో వస్తున్నాయట. ఆ మాటలు నిజమైతే జయకి సన్నిహితులు అని చెప్పుకునే శశికళ,దినకరన్ లు మాత్రమే జయ నివసించిన గది వాడే ధైర్యం చేసింది శశికళ,దినకరన్ మాత్రమే.ఆ ఇద్దరూ కొద్ది రోజులకే జైలుకెళ్లారు. మన్నారుగుడి ప్రచారం చేసింది నిజమే అనుకుంటే జయకి ఇష్టం లేనిది శశికళ,దినకరన్ అవుతారు. కానీ మన్నారుగుడి మాఫియా ఈ విషయాన్ని మర్చిపోయినట్టు నటిస్తూ వేద నిలయం జోలికి ఎవరూ రాకుండా జనానికి చంద్రముఖి సినిమా చూపిస్తోంది.

Post Your Coment
Loading...