మన్యం పులి మూవీ రివ్యూ…

0
1298

Posted December 2, 2016 (6 days ago)

Image result for manyam puli movie review

చిత్రం : మన్యం పులి (2016)
నటీనటులు : మోహన్ లాల్, కమలిని ముఖర్జీ, జగపతి బాబు, నందిత
సంగీతం : గోపీసుందర్
దర్శకుడు : వైశాఖ్
నిర్మాత : సిందూరపువ్వు కృష్ణా రెడ్డి
రిలీజ్ డేట్ : 2 డిసెంబర్, 2016.

మోహన్ లాల్.. మళయాళ సూపర్ స్టార్. ఆయనకి టాలీవుడ్ లోనూ సూపర్ స్టార్ రేంజ్ లో మార్కెట్ ఉంది.ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. ‘జనతా గ్యారేజ్’ ఏకంగా రూ.100కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికే మళయాళంలో రూ.100కోట్లు వసూలు చేసింది మన్యం పులి. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మోహన్ లాల్,కమలిని ముఖర్జీ, జగపతి బాబు, నందిత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మన్యం పులి’. వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు (శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఈమధ్య మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకి టచ్ లోనే ఉంటున్నాడు.జనతా గ్యారేజ్ లో ఆయన పాత్ర మాస్, క్లాస్ ప్రేక్షకులని బాగా కనెక్ట్ అయ్యింది.మిగితా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న జగపతి బాబు, కమలిని ముఖర్జీ,నందిత కూడా తెలుగు ప్రేక్షకులకి తెలిసిన స్టార్లు కావడం మన్యం పులికి కలిసొచ్చే అంశం. స్టార్ కాస్ట్,హై ఎక్స్ పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన’మన్యం పులి’లి కథేంటీ.. ?అది తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
Image result for manyam puli movie review

కథ :
పల్లెటూరు జనాలని చంపే పులికి నరసింహా అలియాస్ పులి (మోహన్ లాల్)కి మధ్య సాగే కథే ‘మన్యం పులి’.పులి భారి నుంచి ప్రజలని కాపాడేందులు పులి వేటగాడుగా మారతాడు నరసింహా. దీంతో..గ్రామస్థులంతా నరసింహాని మన్యం పులి అని పులుచుకుంటారు.లారీ డ్రైవర్ గా పనిచేసే మన్యం పులి భార్య కమలిని ముఖర్జీ.కూతురు మైనా. ఇలాంటి నేపథ్యం ఉన్న నరసింహ జీవిత గాథ ఈ మన్యం పులి సినిమా.

సోదరుడికి జన్మనివ్వగానే నరసింహా తల్లి చనిపోతుంది.తండ్రి, తమ్ముడు,మామయ్యలతో కలిసి కుమార్ జీవనం సాగిస్తుంటాడు.నరసింహా తండ్రి ఓ విషయంలో జైలు పాలవుతాడు.పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పులికి ఆహారంగా మారిపోతాడు.దీంతో..కోపంతో మామయ్యతో కలసి పులితో పోరాటం చేసి దానిని చంపేస్తాడు నరసింహా.లారీ డ్రైవర్ గా జీవినం సాగిస్తున్న నరసింహా కి కుటుంబానికి సంబంధించిన పగ ఒకటి ఉంటుంది.అదేంటీ..?కథలో జగపతి బాబు ,నందితలు ఎవరు.. ? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* మోహన్ లాల్
*కథ- స్క్రీన్ ప్లే
* సినిమాటోగ్రఫీ
* సంగీతం
మైనస్ పాయింట్స్ :
* కామెడీ మిస్
* అక్కడక్కడ స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
మోహన్ లాల్ ని ‘సంపూర్ణ నటుడు’ అని పిలుస్తారు. ‘మన్యం పులి’లోనూ ఆ సంపూర్ణ నటన కనబడింది. ఆయన నటన సినిమా స్థాయిని మరింత పెంచింది. 10ని॥ల పాటు పులితో మోహన్ లాల్ చేసిన ఫైట్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.దర్శకుడు వైశాఖ్ కెరీర్ లో ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోనుంది..ఈ చిత్రం. ఈ చిత్రాన్ని యాక్షన్ ప్యాకేజ్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలం అయ్యారు.ఇది మోహన్ లాల్ ఫ్యాన్స్ కి విందు భోజనంలాంటిది.జగపతి బాబు నటన సూపర్భ్.

దర్శకుడు,మోహన్ లాల్ తర్వాత సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి.షాజీ కుమార్ అందించిన ఫోటో గ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది.కమలినీ ముఖర్జీ, నందిత నటనతో ఆకట్టుకొన్నారు.మిగితా నటీనటులు ఓకే అనిపించారు.

సాంకేతికంగా :
 సినిమాటోగ్రఫీ సూపర్బ్. యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఇలాంటి సినిమాటోగ్రఫీ అందించడం గ్రేట్. పీటర్ హేన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకొన్నాయి. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ సాగింది. గోపీసుందర్ అందించిన పాటలు,నేపథ్య సంగీతం బాగున్నాయి. సెకాండాప్ లో కాస్త స్లోనేరేషన్ అనిపిస్తుంది. ఇక, తెలుగు ప్రేక్షకులు కథతో సంబంధం లేకుండా కామెడీని ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. ఇందులో కామెడీ మిస్సయ్యింది. ఎడిటింగ్ ఓకే.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
ఇప్పటికే మళయాళంలో ‘మన్యం పులి’ బ్లాక్ బస్టర్ అయ్యింది.అక్కడ వందకోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకునే ఉంది. తెలుగు ప్రేక్షకులకి కూడా ‘మన్యం పులి’ మజాని పంచడం ఖాయం.

బాటమ్ లైన్ : ‘మన్యం పులి’.. పులితో పోరాటం
రేటింగ్ : 3/5

NO COMMENTS

LEAVE A REPLY