మనుషుల శాడిజమ్ కి కోతి మృతి..

Posted November 24, 2016

medical college students herrasing monkeyవైద్యో నారాయణో హరి అన్నారు పెడ్తారు అంటే వైద్యుడే దేవుడితో సమానం అని ..కానీ అక్కడ సాక్షత్తు భవిష్యత్తు వైద్యులే యమా దోటలుగా మారి ఓ కోతి ప్రాణాలను హరించారు … పైశాచిక ఆనందం కోసం ఓ మూగ జీవిని చిత్ర హింసలు పెట్టి మరీ చంపారు కొందరు కాబోయే వైద్యులు. ఈ దారుణ ఘటన చెన్నై వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలలో చోటుచేసుకుంది. నలుగురు విద్యార్థులు ఓ కోతి చేతులు, కాళ్లు కట్టేసి, దాన్ని చిత్రహింసలు పెట్టి చంపి.. పాతి పెట్టారు. నలుగురు వైద్య విద్యార్థులు దాన్ని దుప్పటితో కప్పి, చేతులు కట్టేసి ఇతర విద్యార్థుల ముందు చిత్రహింసలు పెట్టారు. బెల్టులు, కట్టెలతో కొట్టి.. అంతటితో ఆగక ఓ ఇనుపచువ్వని దాని శరీరంలోకి దూర్చి చంపారు.

ఆ కళేబరాన్ని హాస్టల్‌కు సమీపంలోనే గుంత తవ్వి పూడ్చారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నైకి చెందిన జంతు సంక్షేమ కార్యకర్త శ్రావణ్‌ కృష్ణన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి కోతిని పూడ్చిన ప్రదేశానికి వెళ్లి కళేబరాన్ని బయటకు తీశారు. పోలీసులు ఆ నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కళాశాల యాజమాన్యం హాస్టల్‌ జనరల్‌ సెక్రెటరీని, నలుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. గతంలోనూ చెన్నైకి చెందిన వైద్య విద్యార్థి ఒకరు కుక్కను మేడపై నుంచి కిందకి విసిరి.. ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. అప్పట్లో ఈ ఘటనను ఖండిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే…..

[wpdevart_youtube]9WeDPbVaMz8[/wpdevart_youtube]

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY