మెగాబ్రదర్స్ ని మూడుదారులు చేసిన మోడీ ..

0
83

Posted November 22, 2016 (2 weeks ago)

mega brothers respond on 500 1000 rs currency ban in different ways
సినిమా రంగంలో మెగా బ్రదర్స్ మధ్య ఎంత ఐక్యత ఉండేదో…పాడు రాజకీయం వారి దారులు వేరు చేసింది .వారి మధ్య విభేదాలు బహిరంగ రహస్యమే అయినా ఇప్పుడు ప్రధాని మోడీ వాటిని పూర్తిగా బయటపడేట్టు చేసాడు.అయన తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మీద మెగా బ్రదర్స్ ముగ్గురు మూడు రకాలుగా స్పందించారు.మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా హడావిడి లో ఉండి మోడీ నిర్ణయం మీద నోరు విప్పలేదు.

అయితే మోడీ నిర్ణయం సామాన్యులకి ఇబ్బంది కలిగిస్తోందని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసాడు.ఓ రచయిత కవితని కూడా ఆ ట్వీట్ లో ఉంచి మరీ సామాన్యుడి వెతల్ని అయన ప్రస్తావించారు.ఇక ఎప్పుడూ వివాదాస్పద అంశాలకి దూరంగా వుండే నాగబాబుకు సామాజిక అంశాల పట్ల ఆసక్తి,అవగాహన రెండూ ఎక్కువే.అయన మాత్రం అన్నాతమ్ముళ్ళకి భిన్నంగా మోడీ మీద ప్రశంసల జల్లు కురిపిస్తూ బైట్ ఇచ్చారు.వ్యక్తిగతంగా సంబంధం లేకపోయినా ఒకే విషయంలో మూడు దారులుగా కనిపిస్తున్న మెగా బ్రదర్స్ ని చూసి వారి అభిమానులు నొచ్చుకుంటున్నారు.

‘పెద్ద నోట్ల రద్దు పై సామన్యుడి స్పందన’ అని నా సన్నిహితుడైన రచయుత సాయిమాధవ్ రాసినది

NO COMMENTS

LEAVE A REPLY